Newsవెంటిలేటర్‌పై దాసరి.. పరిస్థితి ఆందోళనకరం

వెంటిలేటర్‌పై దాసరి.. పరిస్థితి ఆందోళనకరం

KIMS hospital released the medical buletin on Dasari Narayana Rao’s health condition. According to report, they giving treatement Dasari through dialasis and ventilator.

గతకొన్నాళ్ల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దర్శకరత్న దాసరి నారాయణ రావు ఈరోజు (31-07-2017) హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మూత్రపిండాలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ప్రస్తుతం కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనని సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో.. హాస్పిటల్ యాజమాన్యం ఓ మెడికల్ బులెటిన్ విడుదల చేసింది.

‘మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్‌లో చేరిన ప్రముఖ సినీ దర్శకుడు డా. దాసరి నారాయణ రావు గారికి తగిన చికిత్స అందిస్తున్నాం. డయాలసిస్, వెంటిలేటర్ ద్వారా సపోర్ట్ చేస్తున్నాం. దీనికి ఆయన స్పందిస్తున్నారు. ఇన్ఫెక్షన్‌ను కంట్రోల్ చేయడానికి చెస్ట్ ఆపరేషన్ చేయబోతున్నాం. ఆపరేషన్ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరోసారి సమాచారాన్ని అందిస్తాం’ అని కిమ్స్ హాస్పిటల్ ఎండీ-సీఈఓ అయిన డా.బొల్లినేని భాస్కర రావు పేరున మెడికల్ బులిటెన్ విడుదలయ్యింది.

కాగా.. దాసరి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలియగానే యావత్ తెలుగు ప్రజలు ఖంగుతిన్నారు. దాంతో.. పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఆయన వెంటనే తేరుకుని, ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

dasari-on-ventilator-1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news