Gossipsఅమెరికాలో అదరగొట్టిన యంగ్ టైగర్..!

అమెరికాలో అదరగొట్టిన యంగ్ టైగర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తారక్ మూడు డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన జై టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఇక లవ కుమార్ లుక్ కూడా బాగా కనెక్ట్ అవడంతో సినిమా రికార్డ్ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ముఖ్యంగా యూఎస్ లో తారక్ ఏ సినిమా చేయనంత బిజినెస్ జై లవకుశ చేయడం విశేషం. యూఎస్ లో జై లవకుశ అత్యధికంగా 8.5 కోట్లకు డీల్ సెట్ చేశారట. తారక్ కెరియర్ లో యూఎస్ లో ఈ రేంజ్ లో సినిమా బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాపై తారక్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news