చిరంజీవి 151వ మూవీ ప్రారంభం… లోగో ఫస్ట్ లుక్ డబుల్ ధమాకా ఆ రోజే !!

chiru new movie opening

చిరంజీవి 151 వ చిత్రం కోసం అభిమానులు కొన్నాళ్ళుగా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని తెలిసిన‌ప్ప‌టికి, ఈ మూవీ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని అభిమానులు వేయిక‌ళ్ళ‌తో ఎదురు చూస్తూ వ‌చ్చారు. ఎట్ట‌కేల‌కు బుధవారం కొణిదెల ప్రొడ‌క్ష‌న్ ఆఫీసులో చిరు 151వ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. చిరంజీవి, సురేఖ‌, రామ్ చ‌రణ్ , అల్లు అర‌వింద్, ప‌ర‌చూరి బ్ర‌ద‌ర్స్, సురేంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

ఆగ‌స్ట్ 22న చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఉదయం 11 గంటల 30 నిమిషాలకు చిత్ర లోగో మరియు మోషన్ పోస్టర్ ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్రకటించారు .దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ చిరు 151వ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమా అధిక భాగం షూటింగ్ ఉత్తర భారత దేశంలో చిత్రీకరణ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలనే విషయంలో మేకర్స్ ఓ క్లారిటీ రాకపోయినప్పటికి ఐశ్వర్యరాయ్, అనుష్క, నయనతార లలో ఒకరిని తీసుకుంటారనే ప్రచారం మాత్రం జరుగుతుంది. ఇక బిగ్ బీ అమితాబ్ బచ్చ‌న్ కూడా ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నాడని వార్త‌లు వ‌చ్చాయి. ఈగ చిత్రంలో విల‌న్ గా న‌టించిన కిచ్చా సుదీప్ కూడా చిరు 151వ చిత్రంలో కీల‌క పాత్ర చేయ‌బోతున్నాడ‌ని అంటున్నారు . ఆ మ‌ధ్య ఉపేంద్ర‌ని కూడా ఈ సినిమాకి సెల‌క్ట్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌హ‌వీర అనే టైటిల్ ని ఈ మూవీకి ప‌రిశీలిస్తున్నారు.

Leave a comment