Gossips‘జై లవ కుశ’కి శాపంగా మారిన ఆ బ్యాడ్ సెంటిమెంట్.. ఫ్యాన్స్‌లో...

‘జై లవ కుశ’కి శాపంగా మారిన ఆ బ్యాడ్ సెంటిమెంట్.. ఫ్యాన్స్‌లో ఆందోళన

టాలీవుడ్ సెంటిమెంట్లకు పెట్టింది పేరు. చిన్న టెక్నీషియన్ దగ్గరనుంచి స్టార్ హీరోలవరకు ప్రతిఒక్కరూ వీటిని తు.చ. తప్పకుండా ఫాలో అవుతారు. అలాంటిది ఫ్యాన్స్ ఊరికే వుంటారా.. వాళ్లు కూడా గుడ్డిగా నమ్మేస్తారు. పాజిటివ్ అంశాలైతే పెద్దగా పట్టించుకోరు కానీ.. నెగెటివ్‌గా ఏదైనా ఒక చిన్న అనుమానం వస్తే మాత్రం బెంబేలెత్తిపోతారు. అది తమ హీరో చిత్రంపై ఎక్కడ ప్రభావం చూపుతుందోనని తెగ టెన్షన్ పడిపోతుంటారు. తాజాగా తారక్ ఫ్యాన్స్ ఓ బ్యాడ్ సెంటిమెంట్ పట్టుకుని తెగ ఆందోళన చెందుతున్నారు. అది ‘జై లవ కుశ’పై ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందేనని ఆరాటపడుతున్నారు. ఆ మూవీకి సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదలైనప్పటి నుంచే అభిమానుల్లో ఈ టెన్షన్ మొదలయ్యింది. పదండి.. వారిని అంతగా భయపెట్టిస్తున్న ఆ సెంటిమెంట్ ఏంటో మేటర్‌లోకి వెళ్ళి తెలుసుకుందాం..

‘జై లవ కుశ’ ఫస్ట్‌లుక్‌లో మీసాలు తిప్పిన రాయల్ గెటప్‌లో తారక్ అదిరిపోయాడు కానీ.. గతంలో ఇలాగే కొన్ని ఘనమైన చిత్రాల్లో కనిపించాడు. అవే.. ఆంధ్రావాలా, శక్తి, దమ్ము. ఆ మూడు మూవీల్లో సేమ్ గెటప్‌తోనే దర్శనమిచ్చాడు ఎన్టీఆర్. అయితే.. ఆ మూడు సినిమాలు తారక్ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. అప్పట్లో అవి అతని కెరీర్‌ని డీలా చేసి పడేశాయి. అలాంటిది.. ‘జై లవ కుశ’లోనూ ఆ గెటప్‌తోనే కనిపిస్తుండడంతో, ఆ మూడు సినిమాల ఫ్లాప్ సెంటిమెంట్ ఆ చిత్రంపై ప్రభావం చూపుతాయేమోనని టెన్షన్ పడిపోతున్నారు. ఈసారైనా ఆ కోర మీసాల లుక్ అచ్చొస్తుందా? అని చర్చించుకుంటున్నారు. అయితే.. సినీ విశ్లేషకులు మాత్రం అలాంటి ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్రస్తుతం తారక్ సక్సెస్ రేట్ పీక్ స్టేజ్‌లో వుందని, దానిముందు ఎలాంటి సెంటిమెంట్స్ వర్కౌట్ అవ్వవని, ‘జై లవ కుశ’ ఒక మంచి సబ్జెక్ట్‌తో రూపొందుతోంది కాబట్టి అది కచ్ఛితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news