Newsఫాంలో ఉన్న జగపతి.. 4 కోట్లు లాస్ అయ్యాడు..!

ఫాంలో ఉన్న జగపతి.. 4 కోట్లు లాస్ అయ్యాడు..!

తెలుగు సినిమాల్లో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకుని లెజెండ్ సినిమాతో విలన్ గా మారి సక్సెస్ ఫుల్ గా విలన్ అండ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ కొనసాగిస్తున్న జగపతి బాబు ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వల్ల 4 కోట్ల లాస్ అయినట్టు తెలుస్తుంది. మెట్రో నగరాల్లో పేరు మోసిన కన్ స్ట్రక్షన్ కంపెనీ అయిన లోధ కూకట్ పల్లి ఏరియాల్లో విలాసవంతమైన అపార్ట్ మెంట్ కట్టిస్తామని తన దగ్గర 4 కోట్లు తీసుకున్నారని తీరా చూస్తే వారు చెప్పిన 10 ఎకరాల్లో కాకుండా 3 ఎకరాల్లోనే ఈ అపార్ట్ మెంట్ కడుతున్నట్టు తెలిపారు.

ఈ విషయంపై సీరియస్ గా ఉన్న జగపతి బాబు తమ ప్రైవసీకి భంగం కలిగించేలా ఈ అపార్ట్ మెంట్ ఉన్నదని.. సాధారణ అపార్ట్ మెంట్ లతో కలిపి కట్టేట్లయితే 4 కోట్లు ఎందుకు వెచ్చించాలని అంటున్నారు. అంతేకాదు కాంపౌండ్ వాల్ గురించి కూడా కొన్ని అక్రమాలు బయటపడ్డాయని జి.హెచ్.ఎం.సి నిబంధనలకు వ్యతిరేకంగా ఈ అపార్ట్ మెంట్ కడుతున్నారని అంటున్నారు జగపతి బాబు.

ఈ విషయంపై తాను జి.హెచ్.ఎం.సి అధికారులకు కంప్లైంట్ చేస్తానని.. విషయం అంత తేలికగా వదిలిపెట్టేది లేదని అన్నారు. కట్టిన డబ్బు తిరిగి ఇస్తే ఓకే లేదంటే లోధ సంస్థ మీద యుద్ధానికి రెడీ అన్నట్టు మాట్లాడుతున్నారు జగ్గూ భాయ్. జగపతితో పాటు అదే క్యాటగిరిలో ఉన్న వివిఐపిలు తన గోడుని వెళ్లబుచ్చుతున్నారు. మరి ఈ విషయం ఎప్పటికి తేలుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news