Gossipsఅజ్ఞాతవాసి కాదు.. పవన్ కి ఈ సినిమా కానీ పడుంటే ...నా...

అజ్ఞాతవాసి కాదు.. పవన్ కి ఈ సినిమా కానీ పడుంటే …నా సామిరంగా..!

పవన్ కళ్యాణ్, త్రివిక్రం కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి పవన్ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా అంచనాలను అందుకోవడం అటుంచితే అపవాదాలతో హాట్ న్యూస్ గా నిలిచింది. ఇక ఆ సంగతి పక్కన పెడితే సినిమాతో సూపర్ హిట్ కొట్టి పొలిటికల్ ఇన్వాల్వ్ మెంట్ లో బిజీ అవుదామనుకున్న పవన్ కు అజ్ఞాతవాసి నిరాశ పరచింది.

అయితే ఈ టైంలో అజ్ఞాతవాసి సినిమా కాకుండా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో పవన్ వచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ కాంబోలో వస్తున్న భరత్ అనే నేను సినిమా పవన్ చేసి ఉంటే బాగుండేదని.. మహేష్ ను సిఎంగా చూపిస్తున్న కొరటాల శివ ఈ కథ పవన్ కు ఎందుకు చెప్పలేదని అంటున్నారు. అయితే పవన్ కు ఈ సినిమా కథ చెప్పే ప్రయత్నం చేసినా సారీ అనేశాడట అందుకే మహేష్ తో ఫిక్స్ చేశాడు కొరటాల శివ.

అనుకున్నట్టుగా భరత్ అనే నేను సినిమా పవన్ చేసి ఉంటే కచ్చితంగా తన పొలిటికల్ కెరియర్ కు ఉపయోగపడేదని తెలుస్తుంది. సినిమా రిలీజ్ కు ముందే ఇలా అనుకుంటే భరత్ అనే నేను సినిమా వచ్చి హిట్ అయితే మంచి సినిమా మిస్ అయ్యనని పవన్ బాధపడక తప్పదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news