Gossipsఎన్టీఆర్ ఫై నందమూరి ఫ్యాన్స్ ఫైర్

ఎన్టీఆర్ ఫై నందమూరి ఫ్యాన్స్ ఫైర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ ఇద్దరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బీభత్సాలను సృష్టిస్తాయి. అయితే మొదట్లో ఎన్.టి.ఆర్ ను ప్రోత్సహించిన బాలయ్య ఎందుకో వెనక్కి తగ్గాడు. అంతేకాదు ఎన్.టి.ఆర్, బాలకృష్ణల మధ్య దూరం కూడా పెరిగింది. అయితే ఈ క్రమంలో వారి దూరాన్ని దగ్గర చేయాలని అభిమానులు, ఇండస్ట్రీ వారు ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు.1

ntr

అయితే నందమూరి హీరోల సినిమాలు రెండు పోటీగా దిగినా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పరిచారు నందమూరి ఫ్యాన్స్. అయితే ఇప్పుడు అదే ఫ్యాన్స్ ఎన్.టి.ఆర్ మీద గుర్రుగా ఉన్నారని టాక్. అదేంటి ప్రాణంగా ప్రేమించే ఫ్యాన్స్ ఎందుకు తారక్ ను ధ్వేషిస్తారు అంటే.. బాలయ్యకు ఈసారి పోటీగా రావడమే అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.nandamuri-balakrishna-u-tur

ఆ సినిమా అనుకున్న టైం కు స్టార్ట్ అయితే ఈ ఇయర్ దసరాకి వచ్చేది కాని ఇప్పుడు అది సంక్రాంతికి వాయిదా వేశారట. అయితే ఇప్పటికే బాలయ్య బాబు తండ్రి ఎన్.టి.ఆర్ బయోపిక్ గా చేస్తున్న ఎన్.టి.ఆర్ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. అసలే బయోపిక్ అందులోనూ అన్నగారి సినిమా అందుకే ఫ్యాన్స్ అంతా ఆ సినిమాపై గురి పెట్టారు. అయితే ఆ సినిమాకు పోటీగా తారక్ సినిమా రావడం మాత్రం జీర్ణించుకోవట్లేదు. సీనియర్ ఎన్.టి.ఆర్ కు పోటీగా జూనియర్ వస్తాడా అంటూ డిస్కషన్స్ మొదలుపెట్టారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news