Gossipsరాజకీయాల్లోకి దిల్ రాజు.. ఆ రెండు స్థానాల్లో ఒక స్థానం నుండి...

రాజకీయాల్లోకి దిల్ రాజు.. ఆ రెండు స్థానాల్లో ఒక స్థానం నుండి ఎంపీ గా పోటీ!!

2019 ఎన్నికలు..తమ పాలనకు రెఫరెండంగా భావిస్తున్న గులాబీ పార్టీ..మరోసారి అధికార పీఠం కైవసం చేసుకునేందుకు ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తోంది. అందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. అభివృద్ధి నినాదాన్ని తీసుకోవ‌డంతో పాటు పార్టీకి సినీ గ్లామ‌ర్ తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. విజ‌యశాంతి పార్టీకి దూర‌మైనా గ‌త ఎన్నిక‌ల్లో హాస్యనటుడు బాబూ మోహ‌న్‌ అధికార పార్టీ త‌ర‌పున పోటీ చేసి విజ‌యం సాధించారు.తెలంగాణ యాస‌, భాష‌తో విజ‌యం సాధించిన ఫిదా సినిమాను ఇటీవల చూసిన సీఎం కేసీఆర్‌…నటీనటులు చక్కగా నటించారని ప్రశంసలు గుప్పించారు. అంతేకాదు ఆ సిన్మా నిర్మాత దిల్‌రాజును పార్టీలోకి ఆహ్వానించాలని సీఎం నిర్ణయించినట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది.

నిజామాబాద్ జిల్లాకు చెందిన దిల్ రాజుకు టీఆర్‌ఎస్‌ ప్రముఖుల‌తో స‌న్నిహిత సంబంధాలున్నాయి. దిల్‌రాజ్‌ కారుపార్టీలో చేరితే సినీ గ్లామ‌ర్ లోటును పూడ్చవ‌చ్చన్న అభిప్రాయం నేత‌ల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు తమ పార్టీవైపు మొగ్గుచూపే సినీ ప్రముఖులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునే వ్యూహాంలో భాగంగానే.. మంత్రి కెటిఆర్ సినిమా ఫంక్షన్లకు హాజ‌ర‌వుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.దిల్‌రాజు అధికార పార్టీలో చేరినట్లయితే..నిజామాబాద్ లేదా జ‌హీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు అవ‌కాశం కల్పించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారట. ప్రస్తుతం ఆ రెండు స్థానాల్లో టిఆర్ఎస్ ఎంపీలే ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. అయితే నిజామాబాద్ ఎంపీగా కొన‌సాగుతున్న క‌విత రాష్ట్ర రాజ‌కీయాల‌పై మొగ్గు చూపిస్తున్నట్లు టాక్‌.. జ‌హీరాబాద్ ఎంపీగా ఉన్న బిబి పాటిస్‌పై సీఎం కేసీఆర్‌ అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వ‌ర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో దిల్‌రాజ్‌ను 2019 ఎన్నికల్లో ఎంపీ స్థానానికి పోటీచేయించేందుకు లైన్‌ క్లీయర్‌ చేస్తున్నారట పార్టీ పెద్దలు. మరి దిల్‌ రాజ్‌ కారు ఎక్కుతారో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news