Gossipsమెగా అల్లుడు కాబోతున్న ప్రభాస్ ..?

మెగా అల్లుడు కాబోతున్న ప్రభాస్ ..?

సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమో ఏది అబద్దమో తెలియని గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎన్నో సంచలన విషయాలు ఈ సోషల్ మీడియా పుణ్యమా అంటూ బయటపడుతున్నాయి. తాజాగా ఓ నిరాధార వార్త సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. అదేంటని.. మాత్రం అడక్కండి మీరే చదువుకోండి.

తెలుగు సినీ ఇండ్రస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రెజే వేరు. ఇప్పుడు ఆ మెగా ఫ్యామిలీ అమ్మాయిని ఓ యువ స్టార్ హీరో కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారనే వార్త బాగా ప్రచారంలో ఉంది. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక తెలుసు కదా ఈ మధ్య వరుస సినిమాలతో దూసుకుపోతోంది . ఈ మధ్యనే ఓ తమిళ సినిమాతో అక్కడ కూడా అరంగేట్రం చేసి తన టాలెంట్ నిరూపించుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ యువ హీరోయిన్ పెళ్లిపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అది ఎవరితోనో తెలుసా ..? బాహుబలి తో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న యువ హీరో ప్రభాస్.

ఈ మధ్యనే ప్రభాస్ పెళ్లిపై వారి కుటుంబ సభ్యులు కూడా వార్తల్లోకి ఎక్కారు. ఈ సంవత్సరం ఎలాగైన్నా పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. దేనిలో భాగంగానే… ఆయన కుటుంబ సభ్యులు మరియు కృష్ణం రాజు సంబంధాలు చూడటం కూడా మొదలు పెట్టేసారు .. ఇంతలోనే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, నాగబాబు కూతురు నిహారికాని ప్రభాస్ కి ఇచ్చి పెళ్లి చేయాలి అని ఆలోచిస్తున్నట్టు వార్తలు బయటకి పొక్కాయి.

అయితే దీనిమీద పూర్తి వివరాలు తెలియనప్పటికీ .. ఈ విషయం గురించి నాగబాబు చిరంజీవితో మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీంట్లో ఎంత నిజం ఉంది అనే విషయం మాత్రం తెలియడంలేదు. ఈ విష్యం గురించి అటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ… ప్రభాస్ ఫ్యామిలీ నుంచి కానీ ఎటువంటి సమాచారం బయటకి పొక్కడంలేదు. అసలు ఈ విషయం నిజామా ..? అబద్దమా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news