Gossipsషాకింగ్ న్యూస్ : చిరు అల్లుడి సినిమా చిరిగిపోతుందంట.. మెగా హిట్టు...

షాకింగ్ న్యూస్ : చిరు అల్లుడి సినిమా చిరిగిపోతుందంట.. మెగా హిట్టు గ్యారంటీ !!

మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ సినీ హీరోగా రంగప్రవేశం జరిగిన విషయం తెలిసిందే.. మంచి సినిమాల నిర్మాత గా పేరున్న సాయి కొర్రపాటి ఈ సినిమాని నిర్మిస్తుండగా ‘జత కలిసే’ సినిమా ని డైరెక్ట్ చేసిన రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు.సత్యానంద్ దగ్గర హీరో గా ట్రైనింగ్ తీసుకున్న కళ్యాణ్ దేవ్ చూడటానికి చక్కగానే ఉన్నాడు అనే టాక్ అయితే తెచ్చుకుంటున్నాడు.

ఇక మెగా ఫాన్స్ పండగ చేసుకునే న్యూస్ ఒకటి ఫిలిం నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఆ సినిమా స్టోరీ లైన్. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో నడిచే సూపర్ ట్విస్టులతో కూడిన థ్రిల్లర్ జానర్ లో ఉంటుందంట ఈ సినిమా. ఇక మెగా ఫాన్స్ ఆశించే డాన్స్ , ఫైట్లు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని మంచి మసాలాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నారట. కాలేజీ స్టూడెంట్ గా కళ్యాణ్ దేవ్ ఈ సినిమా లో నటిస్తూ మంచి ఈజ్ కనపరుస్తాడంట. ఫ్యాన్స్ ని ఏమాత్రం నిరాశ పరచకుండా ఉండేలా కథ కథనాలు చాలా జాగ్రత్తగా డెవలప్ చేసుకున్నారట. ఇక ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇక చెప్పేదేముంది, మెగా హిట్టు గ్యారంటీ అంటున్నారు సినీ వర్గాలు..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news