Moviesచిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ 20 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ వివరాలు

చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ 20 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ వివరాలు

Megastar Chiranjeevi’s milestone 150th movie Khaidi No 150 has earning very well in it’s third week also.

మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ‘ఖైదీ నెంబర్ 150’ బాక్సాఫీస్ వద్ద 20 రోజులు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న సందర్భంగా.. అన్ని డేస్‌లో ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసిందన్న వివరాల్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వారి లెక్కల ప్రకారం.. ఈ చిత్రం 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 101.08 కోట్లు కలెక్ట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే ఈ మూవీ రూ.76.15 కోట్లు కొల్లగొట్టినట్లు వెల్లడైంది. సినిమాలకు చిరు పదేళ్లు గ్యాప్ ఇచ్చినప్పటికీ.. ఆయన స్టామినా ఏమాత్రం తగ్గకపోగా ఇంకా పెరిగిందని ఈ చిత్రం నిరూపించింది.

ఏరియాల వారీగా 20 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 19.40
సీడెడ్ : 14.76
ఉత్తరాంధ్ర : 12.32
ఈస్ట్ గోదావరి : 7.89
వెస్ట్ గోదావరి : 5.85
కృష్ణా : 5.54
గుంటూరు : 7.11
నెల్లూరు : 3.28
ఏపీ+తెలంగాణ : రూ. 76.15 కోట్లు
కర్ణాటక : 9.07
రెస్టాఫ్ ఇండియా : 1.96
ఓవర్సీస్ : 13.70
టోటల్ వరల్డ్ వైడ్ : రూ.101.08 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news