Newsతాగి తందనాలాడిన టాప్ హీరోయిన్.. పక్కన అగ్ర దర్శకుడు కూడా..!

తాగి తందనాలాడిన టాప్ హీరోయిన్.. పక్కన అగ్ర దర్శకుడు కూడా..!

టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా స్టార్స్ సరసన నటించిన ఓ అమ్మడు ఇప్పుడు పార్టీలతో ఫుల్ ఖుషీగా ఉంది. ఆన్ స్క్రీన్ పై కనబడటం మానేసిన ఈ అమ్మడు ఆఫ్ స్క్రీన్ చేయాల్సి చేసేస్తుంది. ఇంతకీ ఎవరి గురించి ఈ ఇంట్రో అంతా అంటే ఇంకెవరు ముద్దుగుమ్మ ఛార్మి కౌర్ గురించే అని చెప్పాలి.

టాలీవుడ్ లో హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న ఛార్మి హీరోయిన్ గా కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి నిర్మాతగా మారింది. పూరి డైరక్షన్ లో వచ్చిన జ్యోతిలక్ష్మిలో నటించి, నిర్మించిన అమ్మడు పూరితో వరుసగా సినిమాలకు సహ నిర్మాతగా ఉంటుంది. ఇక ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన మెహబూబా సినిమా కూడా పూరితో పాటుగా ఛార్మి నిర్మాతగా ఉంది.

సినిమా ఫలితం ఏంటో అందరికి తెలిసిందే కాని సినిమా బాగా తీశాం వారు చూసినా చూడకున్నా మనం ఎప్పుడు హిట్టే అన్న తీరున ఛార్మి ఓ బార్ లో డ్యాన్స్ వేస్తూ కెమెరా కంటికి చిక్కింది. తాగి తందనాలాడుతుంది అనుకోవడం కంటే ఎంచకా పార్టీని ఎంజాయ్ చేస్తుంది అంటే బెటరేమో. ఆ వీడియోలో ఛార్మి రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తుంటే పూరి మాత్రం కూర్చుని ఉన్నాడు. మెహబూబా రిజల్ట్ తేడా కొట్టినా నిర్మాతగా పూరి సేఫ్ సైడ్ అయ్యాడని అంటున్నారు. మెహబూబా సినిమా దిల్ రాజు వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడం జరిగింది.

https://youtu.be/bKL174YdmwE

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news