Moviesఎన్టీఆర్ కి మరియు ఫ్యాన్స్ కి బహిరంగ క్షమాపణలు చెప్పిన బండ్ల...

ఎన్టీఆర్ కి మరియు ఫ్యాన్స్ కి బహిరంగ క్షమాపణలు చెప్పిన బండ్ల గణేష్ !!

బండ్ల గణేష్ ఒకప్పుడు సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ, హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తూ నెమ్మదిగా సినిమాని నిర్మించే స్థాయికి ఎదిగిన వ్యక్తి. తాను,ఎన్టీఆర్ హీరోగా నిర్మించిన సినిమా బాద్షా. ఆ సినిమాకి కొంత నష్టపోయాను అని చెప్పిన బండ్ల ఆ తర్వాత ఎన్టీఆర్ తోనే టెంపర్ సినిమా తీయడం అది హిట్ అవడం తో పాటు డబ్బులు కూడా బాగా వచ్చాయి అని చెప్పాడు. అయితే అసలు కథ అంతా టెంపర్ సినిమా తర్వాత మొదలయింది. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కు తనకు విబేధాలు ఉన్నట్టు చెప్పాడు.

అదే విషయంపై T.N.R తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అలాంటిది ఏమి లేదు ఎన్టీఆర్ చాలా మంచోడు, చాలా గొప్పోడు, చిన్న చెప్పుడు మాటలు విని ఎన్టీఆర్ ను దూరం చేసుకున్నాను, ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్తున్నా, ఆయన ఫాన్స్ కి కూడా క్షమాపణలు చెప్తున్నా అని చెప్పుకొచ్చాడు. ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ కు నాకు కొంచెం విభేదాలు ఉన్నాయి అని తప్పుగా మాట్లాడా, ఇంటికి వచ్చాక మా నాన్న గారు చాల ఫీల్ అయ్యారు,ఆ తర్వాత నాకు అవకాశం రాలేదు, కానీ అది తప్పు చాల మంచివాడు ఆయన నన్ను ఎప్పుడూ ఇబ్బంది ఏమీ పెట్టలేదు, నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎన్టీఆర్ అనే గొప్ప వ్యక్తికీ,ఆయన ఫాన్స్ కి క్షమాపణ చెప్తున్నా.

ఈ క్షమాపణలు ఏవో ఫోన్లో చెప్పవచ్చుగా అని అడిగిన ప్రశ్నకు బండ్ల స్పందిస్తూ ఎన్టీఆర్ గారిని కలుస్తా,మాట్లాడతా కానీ ఫోన్లో మాట్లాడి క్షమాపణలు చెప్పిన దానికీ ఎదురుగా మాట్లాడి చెప్పడంలో చాల తేడా ఉంది అని చెప్పుకొచ్చాడు. ఏది ఏమి అయినా బండ్ల గణేష్ మరోసారి ఎన్టీఆర్ తో జతకట్టి మనకు మంచి సినిమాలు అందించాలి అని కోరుకుంటూ త్వరలోనే వీరిరువురి కాంబినేషన్లో మంచి సినిమా రావాలని ఆశిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news