Gossipsబాలయ్య కి ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వివాదమా? బాలయ్య కొత్త...

బాలయ్య కి ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వివాదమా? బాలయ్య కొత్త బ్యానర్ ఇదే…

బాలకృష్ణ స్పీడ్ పెంచారు.యూత్ తో సమానం గ నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ సినిమాలు తీస్తున్నాడు.హిట్లు మీద హిట్లు కొడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ.అయితే ఈ మధ్యే మొదలైన కె.ఎస్‌.రవికుమార్‌దర్శకత్వంలో 102వ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పీడ్ గ జరుగుతోంది.

ప్రతుతం బాల కృష్ణ సొంత బ్యానర్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు. హీరోల‌కు సొంతంగానో లేదా వారి కుటుంబ స‌భ్యుల‌కో నిర్మాణ సంస్థ‌లు ఉన్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీలో రెండు మూడు నిర్మాణ సంస్థ‌లు ఉన్నాయి. నాగ్‌కు అన్న‌పూర్ణ స్టూడియో, వెంకీకి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఉన్నాయి. ఇక మ‌రో అగ్ర‌హీరో బాల‌కృష్ణ కుటుంబానికి సొంత బ్యాన‌ర్ రామ‌కృష్ణ సినీ స్టూడియోస్ ఉంది.

ఇక నేటి త‌రం హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్లు ఎక్స్‌క్లూజివ్‌గా తమ కోసం ఒక బేనర్ పెట్టుకున్నారు. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ కోసం వీరి బాట‌లోనే న‌డుస్తున్నాడు.

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ తాత పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ స్థాపించి సినిమాలు తీస్తోన్న సంగ‌తి తెలిసిందే.ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటే బాల కృష్ణకు ఇష్టమే దానితో అటువంటి విభేదాలు లేవు తన ఇద్దరు కూతుళ్లు బ్రహ్మణి, తేజస్వి పేర్లు కలిసొచ్చేలా బాలయ్య ‘బ్రహ్మతేజ క్రియేషన్స్’ పేరుతో ఈ కొత్త బ్యాన‌ర్ ప్రారంభిస్తున్న‌ట్టు వెల్లడించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news