అక్కడికొస్తే 5 కోట్లు ఇస్తానన్న ప్రొడ్యూసర్..! నో చెప్పిన అనుష్క

anu

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న ఏ హీరోయిన్ కి అయినా బాలీవుడ్ ఆఫర్ వస్తే ఏమి చేస్తారు ..? ఇంకేం చేస్తారు ఎగిరి గంతులు వేస్తారు. కానీ ఆ టాప్ హీరోయిన్ మాత్రం ఆ ఆఫర్ కి నో చెప్పేసి అందరూ నోరెళ్లబెట్టేలా చేసింది. ఇంతకీ ఈ బ్యూటీ ఆ ఆఫర్ ఎందుకు వద్దందో తెలుసా ..? అయితే తెలుసుకుందాం!
టాలీవుడ్ పరిశ్రమలోని స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్ అనిపించుకున్న స్వీటీ అనుష్క టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది. ఇదే టైం లో ఆమెను వెతుక్కుంటూ బాలివుడ్ ఆఫర్ వచ్చింది. అయితే ఆమె అందరిలా ఎగిరి గంతు వెయ్యలేదు సరికదా చాలా కూల్ గా నో అని సింపుల్ గా చెప్పేసింది ఈ బెంగుళూరు బ్యూటీ. ఇంతకీ ఈ అమ్మడుకి ఆ ఆఫర్ ఇచ్చింది ఎవరో తెలుసా ..?
దక్షిణాది క్రేజీ ప్రాజెక్టుల‌ను ఉత్త‌రాదిన విడుద‌ల చేస్తూ వాటి ద్వారా బాగానే ఆర్జిస్తున్న బాలీవుడ్ అగ్ర నిర్మాత‌ కరణ్ జోహర్.

ఇతగాడు ప్ర‌భాస్, అనుష్క కాంబినేషన్‌లో బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేయ‌బోతున్న‌ట్టు కొంత‌కాలం క్రితం వార్త‌లు వ‌చ్చాయి. అయితే ప్ర‌భాస్ బాలీవుడ్ పై అంత‌గా ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో ఆ ప్రాజెక్టులు ముందుకు సాగ‌లేదు.

ఈ నేప‌థ్యంలో ‘బాహుబలి 2′ ద్వారా ప్రేక్షకులను ఆక‌ట్టుకున్న‌ అనుష్క ప్రధాన పాత్రలో ఒక హీరోయిన్‌ ఓరియెంటెడ్ సినిమానైనా తెర‌కెక్కించాల‌ని కాస్త గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేశాడ‌ట క‌ర‌ణ్. ఇందుకోసం అనుష్కకు ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ ఆఫ‌ర్ చేశాడ‌ట ఈ భారీ చిత్రాల నిర్మాత‌.

అయితే బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌పై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని ఆ ఆఫర్‌ను అనుష్క తిరస్కరించిన‌ట్టు సమాచారం. ప్ర‌స్తుతం అనుష్క ‘భాగమతి’ సినిమాలో న‌టిస్తోంది.

More from my site