Moviesనాగ చైతన్య - అల్లరి నరేష్ ల పోట్లాట..!!

నాగ చైతన్య – అల్లరి నరేష్ ల పోట్లాట..!!

కొద్దిరోజులుగా హిట్ కోసం తపించిపోతున్న అల్లరి నరేష్ తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర విఫలమవుతుంది. ఈ క్రమంలో మలయాళ సూపర్ హిట్ సినిమా ఒరు వడక్కన్ సెల్ఫీ రీమేక్ గా తెలుగులో మేడ మీద అబ్బాయి సినిమాతో రాబోతున్నాడు నరేష్. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాతో అక్కినేని యువ హీరో నాగ చైతన్యతో పోటీ పడుతున్నాడు అల్లరోడు.

రారండోయ్ వేడుక చూద్దాం హిట్ తర్వాత కృష్ణ అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేసిన సినిమా యుద్ధం శరణం. ఈ సినిమా లో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండటం విశేషం. టీజర్ తో అంచనాలను పెంచిన ఈ సినిమా సెప్టెంబర్ 8న రిలీజ్ అవబోతుంది. సక్సెస్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న అల్లరి నరేష్ ఈసారైనా సరే పోటీలో నెగ్గుతాడో చూడాలి.

స్పూఫ్ కథతో కొన్నాళ్లు కెరియర్ జోష్ ఫుల్ గా నడిపించిన అల్లరి నరేష్ సక్సెస్ కోసం చేయని ప్రయత్నాలు లేవని చెప్పాలి. మరి ఈ మేడ మీద అబ్బాయి సినిమ అయినా అల్లరి నరేష్ ఆశలను నెరవేరుతుసుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news