Gossipsసైరా నిర్మాత మార్పు... ఎవరో తెలుసా ?

సైరా నిర్మాత మార్పు… ఎవరో తెలుసా ?

మెగాస్టార్ హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణసారధ్యంలో వెర్సటైల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో వస్తున్నా చిత్రం ‘సైరా ‘ . ఈ సినిమాకు భారీ తారాగణం , సాంకేతిక నిపుణుల లిస్ట్ ను రిలీజ్ చేసారు ప్రొడ్యూసర్ రామ్ చరణ్ .

అయితే ప్రస్తుతం రామ్ చరణ్ ‘రంగ స్థలం – 1985  ‘ చిత్రం షూటింగ్ లో బిజీ గ వున్నారు . షూటింగ్ పార్ట్ అక్టోబర్ లో పూర్తి చేసుకున్న , తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది , ఇది మరో నెల రోజులు పట్టేలా వున్నది . అందువల్ల ‘ సైరా’ చిత్రంని సెట్స్ పైకి వెళ్ళడానికి బాగా సమయం పట్టేలా వుంది .

దీంతో రామ్ చరణ్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారని సమాచారం . తాను ప్రొడ్యూసర్ గ తప్పుకొని , భార్య ఉపాసన కు ఆ భాద్యతలు అప్పగిస్తున్నారని తెలిసింది . అయితే ఆమె కేవలం తాత్కాలిక నిర్మాతగానే వ్యవహరించనున్నారని సమాచారం . రంగస్థలం చిత్రాన్ని పూర్తి చేసి.. చరణ్ వచ్చేలోగా ‘సైరా’ నిర్మాణ వ్యవహారాలను చూసుకోవడానికి ఉపాసన రంగంలోకి దిగుతోందని అంటున్నారు.

కాగా.. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 నుంచి స్టార్ట్ కానుంది. నయనతారతోబాటు పలువురు తెలుగు, తమిళ, హిందీ స్టార్స్ ఇందులో నటించనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news