మెగాహీరో : ‘బాలయ్యగారు.. మాలాంటి హీరోలకు మీరు ఆదర్శం’

mega-heroes-satakarni

Sai Dharam Tej congrats Gautamiputra Satakarni movie unit for getting positive report from all over and also said Balayya is inspiration to young heroes.

మెగా, నందమూరి ఫ్యామిలీలు ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకోవడం చాలా అరుదు. అందుకే.. ఎప్పుడైనా తమ మీద ఏవైనా వ్యాఖ్యలు చేసుకుంటే, అవి టాఫ్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిపోతాయి. తాజాగా మెగా ‘సుప్రీం’ హీరో సాయి ధరమ్ తేజ్ ‘శాతకర్ణి’, బాలయ్యపై చేసిన కామెంట్స్ ప్రాధాన్యాతని సంతరించుకున్నాయి. ‘శాతకర్ణి’ మూవీకి అన్నిచోట్ల నుంచి విపరీతమైన పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్న నేపథ్యంలో.. శాతకర్ణి చిత్రబృందం, క్రిష్, బాలయ్యలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.

‘‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గురించి అద్భుతమైన రిపోర్ట్స్ రావడం వింటున్నా.. అందుకు చిత్రబృందానికి, ముఖ్యంగా దర్శకుడు క్రిష్‌కి కంగ్రాట్స్. బాలయ్యగారు.. మీరు మాలాంటి హీరోలకు ఆదర్శం’ అంటూ ట్విటర్ వేదికగా ఓ ఫోటోతోపాటు ట్వీట్ చేశాడు. ఈ విధంగా ఈ మెగాహీరో పోస్ట్ పెట్టడంతో.. నందమూరి అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి ఈ సినిమా బాగా ఆడాలని రిలీజ్‌కి ముందు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కూడా.. విడుదలకు ముందురోజు రాత్రి ఈ సినిమాకి బెస్ట్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు. ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం రావడం.. నిజంగా అభినందనీయం.. ఆనందనీయం.

More from my site