Gossipsడిఫరెంట్ గా వస్తున్న వీకెండ్ హంగామా..!

డిఫరెంట్ గా వస్తున్న వీకెండ్ హంగామా..!

ఫ్రైడే వచ్చిందంటే సినిమాల సందడి షురూ అయినట్టే. ప్రతి వారం లానే ఈ వారం కూడా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు ఐదారు సినిమాలు వస్తున్నాయి. అయితే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన సినిమాలు మాత్రం మూడు సినిమాలే అని చెప్పొచ్చు. అందులో ఒకటి అక్కినేని హీరో సుశాంత్ నటించిన చిలసౌ. అడివి శేష్ గూఢచారి, మారుతి కథ అందించిన బ్రాండ్ బాబు.

ఈ సినిమాల జానర్లు వేరు.. ఆడియెన్స్ టార్గెట్ కూడా వేరు. సుశాంత్ చిలసౌ లవ్ స్టోరీగా రాబోతుంది. పెళ్లిచూపులకు వెళ్లిన హీరో, హీరోయిన్ ఓ మర్డర్ మిస్టరీలో ఇరుక్కుంటారు. అయితే కథ వీరి లవ్, ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది. ఇక అడివి శేష్ గూఢచారి ఆత్రం టీజర్, ట్రైలర్ తో ఇంప్రెస్ చేశాడు. స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక మారుతి కథ, స్క్రీన్ ప్లేతో వస్తున్న బ్రాండ్ బాబు సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ లీడ్ రోల్స్ లో వస్తుంది. రెగ్యులర్ సినిమాలానే అనిపిస్తున్నా ప్రతిది బ్రాండ్ చూసే హీరో మంత్రి కూతురు అనుకుని ఓ ఇంటి పనిమనిషిని ప్రేమించే కథతో బ్రాండ్ బాబు వస్తుంది. మూడు సినిమాలు మూడు డిఫరెంట్ కాన్సెప్టులతో వస్తున్నాయి. ఇక ఇవే కాకుండా ప్రేక్షకులకు కనీసం తెలియని మరో రెండు సినిమాలు వస్తున్నాయి. మరి ఈ వారం విజేతగా బాక్సాఫీస్ ఫైట్ లో గెలిచేదెవరో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news