Gossipsఅంతేగా..అంతేగా..వెంకటేష్ మంచి ఊపులో ఉన్నాడుగా!

అంతేగా..అంతేగా..వెంకటేష్ మంచి ఊపులో ఉన్నాడుగా!

ఈ మద్య టాలీవుడ్ లో హిట్ అయిన మూవీస్..బాలీవుడ్, కోలీవుడ్ లో రిమేక్ చేస్తుంటే..అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలు ఇక్కడ రిమేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అజయ్ దేవగాన్ నటించిన ‘దే దే ప్యార్ దే’సినిమా తెలుగులో రిమేక్ చేయబోతున్నారట. ఇక రిమేక్ సినిమాలంటే మొదటనుంచీ వెంకటేష్ కు ఇష్టం. ఆయన కెరీర్ లో సూపర్ హిట్స్ అనిపించుకున్న వాటిల్లో రీమేక్ లే ఎక్కువ. కొంత కాలంగా మల్టీ స్టారర్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్న వెంకటేష్ ఈ మద్య వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఎఫ్ 2 మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు.

ప్రస్తుతం నాగ చైతన్యతో వెంకి మామ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరో మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీ ప్రముఖ నిర్మాత, వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు నిర్మిస్తారట. గతంలో తేజతో ఓ సినిమా ప్రాజెక్ట్ ఆగిపోయింది..అది కూడా కంప్లీట్ చేస్తాడట వెంకటేష్.

ఇక ‘నేను లోకల్, సినిమా చూపిస్తా మామ’ ఫేమ్ త్రినాథరావ్ నక్కిన డైరెక్షన్లో కొత్త మూవీ..హిందీలో హిట్ అయిన ‘దేదే ప్యార్ దే’మూవీ రిమేక్ కి ప్లాన్ చేస్తున్నారట సురేష్ బాబు. ఈ మూవీలో టబు చేసిన పాత్రకు గానూ త్రిషను, రకుల్ పాత్రకు రకుల్ నే తీసుకుని ఫన్ తో ఈ సినిమాని చేసి హిట్ కొట్టాలని ఆయన భావిస్తున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news