గీత గోవిందం రికార్డును బద్దలు కొట్టిన శైలజా రెడ్డి అల్లుడు..!

4

అక్కినేని నాగ చైతన్య నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా వినాయక చవితి సందర్భంగా గురువారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మొదటి రోజు 7.53 కోట్ల షేర్ తో నాగ చైతన్య సత్తా ఏంటో చూపించింది. ఇక రెండో రోజు కూడా 3.5 కోట్ల కలక్షన్స్ రాబట్టిందని తెలుస్తుంది. ఓవరాల్ గా రెండు రోజుల్లోనే 40 శాతం రిటర్న్స్ అందుకుంది శైలజా రెడ్డి అల్లుడు.
2

4
25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా విజయ్ దేవరకొండ లేటెస్ట్ సెస్నేషనల్ హిట్ గీతా గోవిందం రికార్డును బ్రేక్ చేసింది. విజయ్, రష్మిక కలిసి నటించిన గీతా గోవిందం సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే నైజాంలో ఈ సినిమా మొదటి రోజు కలెక్ట్ చేసిన దాని కన్నా శైలజా రెడ్డి అల్లుడు ఎక్కువ కలెక్ట్ చేశాడు.
3

1
ఈ లెక్కన గీతా గోవిందం రికార్డ్ శైలజా రెడ్డి అల్లుడు క్రాస్ చేశాడని చెప్పొచ్చు. నైజాంలో శైలజా రెడ్డి అల్లుడు మొదటి రోజు 1.69 కోట్లు చేసి ఈ ఇయర్ లో 7వ హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. మొత్తానికి చైతు కెరియర్ లో ఈ సినిమా క్రేజీ రికార్డులను సొంతం చేసుకోనుంది.

Leave a comment