RGV ‘S లక్ష్మీస్ ఎన్టీఆర్..మరోసారి టాలీవుడ్ లో కలకలం..

139

ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాకు పోటీగా ఎన్.టి.ఆర్ జీవిత కథను తాను చెప్పేందుకు సిద్ధమయ్యాడు ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అని టైటిల్ పెట్టి నానా హడావిడి చేసిన వర్మ ఆ తర్వాత సైలెంట్ అయ్యాడు. దాదాపు ఆ సినిమా అటకెక్కేసింది అనుకున్న టైంలో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అప్డేట్ తో వచ్చాడు వర్మ.
1
అక్టోబర్ 18న దసరా సందర్భంగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మొదలు పెడుతున్నట్టు చెప్ప్పాడు రాం గోపాల్ వర్మ. ఎన్.టి.ఆర్ బయోపిక్ లక్ష్మి పార్వతి ఎంట్రీకి ముందుదాకా ఉంటే తన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మూవీ ఆ తర్వాత జరిగింది చూపిస్తునని అన్నాడు. ఇక అక్టోబర్ 19 తిరుపతిలో ప్రెస్ మీట్ లో మరిన్ని విషయాలు వెళ్లడిస్తానని ట్వీట్ చేశాడు వర్మ.
2
జివి ఫిలంస్ ప్రెజెంటింగ్ లో రాకేష్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నట్టుగా చెప్పాడు. మరి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఎలా ఉండబోతుంది.. వర్మ ఎలాంటి సంచలనాలు చేస్తాడు అన్నది చూడాలి. ఈ సినిమా 2019 జనవరి చివర్లో రిలీజ్ చేస్తానని చెబుతున్నాడు వర్మ.

Leave a comment