పవన్ తో అస్సలు పని లేదు అంటున్న రేణు

Renu Desai & pawan kalyan

బాధ్య‌త‌ని బంధాల‌ను స‌మ‌తూకం వేయ‌డం క‌ష్టం. బిడ్డ‌ల ఎదుగ‌దల‌కు త‌ల్లే కార‌ణం. తండ్రి ఆ జీవిన గ‌తికి ఆధారం. ఒక‌నాటి న‌టి, ఇప్ప‌టి డైరెక్ట‌ర్ క‌మ్ ప్రొడ్యూస‌ర్ రేణూ దేశాయ్ త‌న జీవితానికి సంబంధించి ఎన్నో ఆస‌క్తిదాయ‌క విష‌యాలు వెల్లడించారు. స్టార్ట్ యాక్ష‌న్ కెమెరాలా మూడే మూడు ముక్క‌ల్లో వాటిని తేల్చేయ‌గ‌ల‌మా.. ఆరోగ్యం బాగుండ‌క ఆమె ప‌డిన అవ‌స్థ‌లు త‌ల్లి వేద‌న తెలియ‌క ఆద్య ఏడ్చిన సంద‌ర్భాలూ.. ఇంకా ఎన్నో.. ఓ సింగిల్ పేరెంట్ కి ఉండే విషాదం  బాధ దుఃఖం వీటికి అతీతం ఆమె అని ఎలా అనుకోగ‌లం.

కొత్త జీవితం ఇప్పుడు టెలివిజ‌న్ ప్ర‌సాదిస్తోంది .. నీతోనే డ్యాన్స్ పేరిట చేస్తోన్న ఈ షో దీపావ‌ళి  కాంతులు  నింపుతోంది. పున‌శ్చ‌ర‌ణ ఓ విధంగా ఇబ్బంది. పున‌రావ‌లోక‌న ఇంకా ఇబ్బంది. కానీ వీటిని దాటుకొచ్చిన గాయాల‌ను మరిచిపోవ‌డం క‌ష్టం. త‌న బాధ‌కో అక్ష‌రీక‌ర‌ణ క‌విత్వం అంతే! ఆ అక్షర సంక‌ల‌నం  పేరే రిఫ్లెక్ష‌న్స్ .. త్వ‌ర‌లో విడుద‌ల కానుంద‌ట‌! అనువాదం కూడా పూర్తైంది. ఇంకా స్క్రీన్ రైట‌ర్ గానే త‌న‌ని తాను నిరూపించుకోవ‌డం ఇష్టం అని చెప్పే ఈ ఉత్తరాది మ‌గువ సంగీతం నేర్చుకుంటోంది. త‌న‌కు వ‌చ్చిన ఆర్తో ఇమ్యూన్ కండీష‌న్ నుంచి కోలుకున్నాక హృద‌య స్పంద‌న‌లు ఇంకా ఇంకా కుదుట ప‌డాలంటే ఇదొక్క‌టే మార్గం అని డాక్ట‌ర్ చెప్పారు. ఇదొక సాంత్వ‌న అని కూడా చెప్పారు.

ఆ మాట పాటింపులో భాగంగా పియానో నేర్చుకుంటున్నారీమె.అంతేనా త‌న బాట‌లోనే పిల్ల‌లిద్ద‌రూ న‌డుస్తున్నార‌ని ఆనందం వ్య‌క్తం చేస్తోంది. సంస్కృతి సంప్ర‌దాయం సాహిత్యం సంగీతం ఇవ‌న్నీ రేప‌టి త‌రాల‌కు తెలిస్తేనే కాదు తెలియ‌జేస్తేనే ఆనందం. ఈ దీపావ‌ళి అలాంటి ఆనందాల‌ను మీరూ అందుకోండి అని అంటోంది రేణు.

Leave a comment