హీరోయిన్ల లైంగిక వేధింపుల నుండి హీరోలను కాపాడండి..!

ravi-shankar-shocking-comme

కాస్టింగ్ కౌచ్.. కేవలం తెలుగు పరిశ్రమలోనే కాదు హాలీవుడ్ లో కూడా హంగామా చేస్తున్న అంశం. ఈమధ్య బాగా వినిపిస్తున్న ఈ కాస్టింగ్ కౌచ్ కేవలం హీరోయిన్స్ మీద మాత్రమేనా.. అదేంటి కాస్టింగ్ కౌచ్ అంటే అమ్మాయిల మీదే ఉంటుంది కదా అంటే కాదు హీరోలకు ఆ బెదడ తప్పట్లేదని అంటున్నాడు భోజ్ పూరి నటుడు రవికిషన్.

నటీమణులపై వేధింపులు అందరు వింటున్నమాటే.. కాని కొత్తగా మేల్ కాస్టింగ్ కూడా ఉందని తెలుస్తుంది. ఇదవరకు ఓసారి బాలీవుడ్ యాక్షన్ హీరో రణ్ వీర్ సింగ్ తనకు ఎదురైన ఇలాంటి సంఘటన గురించి చెప్పాడు. అయితే అప్పుడు మీడియా ఆ వార్తలపై అంత ఫోకస్ పెట్టలేదు. ఇక ఇప్పుడు భోజ్ పూరి నటుడు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న రవికిషన్ కేవలం మహిళలకే కాదు పురుషులకు ఇలాంటి వేధింపులు తప్పట్లేదని అంటున్నారు.

కొందరు సీనియర్ హీరోయిన్ల నుంచి మేల్ యాక్టర్స్ మీద పలుమార్లు లైంగిక దాడి జరిగినట్టు చెప్పుకొచ్చాడు రవికిషన్. అయితే ఊరికే మాట్లాడేస్తే ఎలా ఆ హీరోయిన్స్ పేర్లు బయటకు చెబితే కాని మ్యాటర్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. మరి రవికిషన్ చెప్పిన ఆ హీరోయిన్స్ ఎవరో అని ఆరా తీస్తున్నారు.

Leave a comment