రామ్ చరణ్, అల్లుఅర్జున్‌లకు అందుకే ఫోన్ చేయట్లేదంటున్న రానా

Rana reveals why he is not contacting ram charan allu arjun

Rana Daggubati shares an interesting topic in the latest interview. He told that once upon a time he used to call ram charan and allu arjun regularly. But, now he is not contacting them.Read below article to know what he told the reason for this.

వృత్తిపరంగా హీరోల మధ్య పోటీ ఉండడం వాస్తవమేగానీ.. వ్యక్తిగతంగా మాత్రం అందరూ స్నేహంగానే మెలుగుతారు. కొందరి మధ్య మరింత సాన్నిహిత్యం ఉంటుంది. అలాంటి ఫ్రెండ్‌షిప్పే రానా, అల్లుఅర్జున్, రామ్ చరణ్‌ల మధ్య ఉంది. ఆ ఇద్దరితో రానా ఎంతో క్లోజ్‌గా ఉంటాడు. సినిమాల దగ్గరనుంచి వ్యక్తిగత వ్యవహారాల దాకా అన్ని వాళ్లతో షేర్ చేసుకుంటాడు. వాళ్లు నిర్వహించే ప్రతీ ఈవెంట్‌కి వెళ్లడంతోపాటు తాను చేసే ఫంక్షన్లకూ ఆ ఇద్దరినీ ఆహ్వానిస్తాడు. అంతెందుకు.. ప్రతిరోజూ వారికి ఫోన్ చేయనదే రానా ఉండలేదు. అలాంటి రానా.. తాజాగా కుండబద్దలు కొట్టేశాడు. ఆ ఇద్దరితో తన బంధం ఇప్పుడెలా ఉందో చెప్పి షాకిచ్చాడు.

తన చిన్ననాటి స్నేహితులైన చెర్రీ, బన్నీలకు ఫోన్లు చేయకూడదని ఫిక్స్ అయినట్లు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రానా చెప్పాడు. ఎందుకని ప్రశ్నిస్తే.. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారని, పర్సనల్ లైఫ్‌లో బిజీగా ఉంటారు కాబట్టి డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో ఫోన్స్ చేయకూడదని అనుకున్నానని తెలిపాడు. ‘చెర్రీ, బన్నీలకు ఇంతకుముందు రెగ్యులర్‌గా ఎప్పుడుపడితే అప్పుడు ఫోన్ చేసేవాడ్ని. కానీ ఎప్పుడైతే వాళ్ళకు పెళ్ళిళ్లు అయ్యాయో.. వాళ్ళిద్దరు తమ భార్యలతో ఎక్కడికైనా వెళ్లారేమో.. ఫోన్ చేయొచ్చో.. లేదో..? అని అనుకోవడం మొదలెట్టా. పెళ్లయిన వాళ్తతో వర్కౌట్ కావట్లేదని.. నాకన్నా వయసులో చిన్నోళ్లతో ఫ్రెండ్‌షిప్ చేయటం మొదలెట్టా. పెళ్లి అయినోళ్లు ఖాళీగా ఉంటే వాళ్లే ఫోన్ చేస్తారుగా’ అంటూ రానా అసలు విషయం చెప్పుకొచ్చాడు.

ఇదే సమయంలో ‘మీరెప్పుడు పెళ్ళి చేసుకుంటారు’అని రానాని ప్రశ్నిస్తే.. దానికి స్మార్ట్ ఆన్సర్ ఇచ్చాడు. ‘రామ్ చరణ్, బన్నీలకు పెళ్ళి అయినప్పుడు నాక్కూడా చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. మనకూ ఓ అమ్మాయి దొరకితే బాగుంటుందనుకున్నా. కానీ.. దొరకలేదు’ అని వెల్లడించాడు.

Leave a comment