బాలయ్య సినిమాలో విలన్ గా రాజశేఖర్..?

balayya and rajashekar

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ నటించిన ‘PSV గరుడ వేగా’ థియేట్రికల్ ట్రైలర్ నిన్ననందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా అఫిషియల్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే .
ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ బాలయ్య ను సర్ అని సంబోధించారు. బాలయ్య తో కలిసి తాను ఒక సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నానని అయన చెప్పారు .

అయితే గతంలో రాజశేఖర్ విలన్గా ఛాన్స్ వచ్చిన చేస్తాను అని చెప్పారు. అంటే బాలయ్య కు విలన్ గ చెయ్యాలని వుందా ఈ యాంగ్రీ యంగ్ మాన్ కి అని ఎవరి ఎనాలిసిస్ వారు వేసుకుంటున్నారు. లెజెండ్ సినిమాలో అప్పటివరకు హీరో పత్రాలు చేసిన జగపతి బాబు సడన్ గా విలన్ అవతారం ఎత్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనవసరం లేదు .

ఇప్పుడు రాజశేఖర్ విలన్ గా బాలయ్య తో కాంబినేషన్ సెట్ అయితే మల్లి బాక్స్ ఆఫీస్ బద్దలవాల్సిందేనెమో చూడాలి .

Leave a comment