Gossipsపూజ హేగ్దే మొదటి సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పూజ హేగ్దే మొదటి సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే పూజ హేగ్దే అని చెప్పాల్సిందే. సమంత పెళ్లి చేసుకోగా కాజల్ తో స్టార్ హీరోలు చేసే పరిస్థితి కనబడటం లేదు ముకుందతో తెలుగు పరిచయమైన పూజ డిజేతో దుమ్ము దులిపేయగా లేటెస్ట్ గా వచ్చిన అరవింద సమేత సినిమాతో అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది.
2
అరవింద సమేతతో పాటుగా మహేష్ తో మహర్షి, ప్రభాస్ తో మరో సినిమా చేస్తున్న పూజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సంపాదన గురించి ప్రస్థావించింది. కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు తన చేతివ్రాతతో ముంబై అథ్లెటిక్ అసోషియేషన్ లో పాల్గొన్న విద్యార్ధుల పేరుని అందంగా రాశానని. అప్పుడు వారు 200 రూపాయల ప్రైజ్ మనీ అందించారట. అదే తన మొదటి సంపదన అని చెప్పుకొచ్చింది పూజ.
1
కాలేక్ డేస్ లో చాలా సిగ్గు పడేదాన్ని అని.. ఓసారి మాధురి దీక్షిత్ పాటకి డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీద అలా నిలబడి ఉన్నానని.. అలాంటిది తాను ఇప్పుడు కెమెరా ముందు నటిస్తానని ఎప్పుడు అనుకోలేదని అంటుంది. రణ్ బీర్ కపూర్ తో ఓ యాడ్ హిందిలో అవకాశాన్ని తెచ్చిపెట్టిందని. తెలుగులో ప్రస్తుతం కెరియర్ చాలా సంతోషంగా ఉందని అంటుంది పూజ. 200 రూపాయల నుండి కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకునే స్టేజ్ కు వచ్చింది ఈ బికిని బ్యూటీ. చూస్తుంటే టాలీవుడ్ లో ఇప్పుడు అమ్మడు సూపర్ ఫాం లో ఉందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news