బ్రాండ్ బాబు సినిమాపై కేసు నమోదు..!

14

మారుతి రైటింగ్స్ లో సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ జంటగా నటించిన సినిమా బ్రాండ్ బాబు. ప్రభాకర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. అయితే పోటీగా వచ్చిన చిలసౌ, గూఢచారి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో బ్రాండ్ బాబు అంత మంచి టాక్ సొంతం చేసుకోలేదు. మారుతి పెన్ పవర్ ఈసారి వర్క్ అవుట్ కాలేదని అంటున్నారు. సినిమాలో కొన్ని సీన్స్ తప్ప మిగతా అంతా బోర్ అని పబ్లిక్ టాక్.

సినిమా టాకే ఇలా ఉంటే సినిమాపై ఓ మహిళా జర్నలిస్ట్ కేసు వేయడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. బ్రాండ్ బాబు సినిమాలో తన ప్రమేయం లేకుండా సన్నివేశాలలో తన ఫోటో వాడారని. తన ఫేస్ బుక్ నుండి ఆ పిక్ తీసుకున్నట్టు గుర్తించిన సదరు మహిళా జర్నలిస్ట్ చిత్రయూనిట్ మీద పోలీస్ కేసు పెట్టింది. ప్రముఖ దినపత్రికలో పనిచేస్తున్న ఆ మహిళా జర్నలిస్ట్ తన పర్మిషన్ లేకుండా తన ఫోటో వాడినందుకు బ్రాండ్ బాబుపై కేసు వేసింది. మరి ఆమెతో మాట్లాడి ఈ కేసు వెనక్కి తీసుకునే ప్రయత్నాలు జరుగుతాయో లేదా చూడాలి.

Leave a comment