ఎన్టీఆర్ కొత్త లుక్ కోసం బాబీ ఏం చేస్తున్నాడో తెలుసా ??

ntr new look

Young Tiger NTR to have a new look for his upcoming movie with director Bobby. Earlier he had made trend setter for his stylish looks in Temper, Nannaku Prematho. Now he is getting ready again to set a new trend.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక స్పీడు పెంచనున్నాడు. ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న తారక్.. సర్దార్ డైరెక్టర్ బాబీతో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలువుతందని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతున్నాడు తారక్. ఈ సినిమాను వీలనైంత త్వరగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ బాబీ. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తన లుక్‌ను పూర్తిగా మార్చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కొత్త లుక్స్‌తో జనాలకు పిచ్చెక్కించే తారక్.. ఇప్పుడు మరోసారి అదే ట్రెండ్‌ను ఫాలో కానున్నట్లు తెలుస్తోంది.

అప్పట్లో ‘టెంపర్’ సినిమాలో తన లుక్‌ను పూర్తిగా మార్చేసి టాలీవుడ్‌కే షాకిచ్చాడు ఎన్టీఆర్. ఇక ఆ తరువాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో అయితే ఏకంగా గడ్డం పెంచేసిన కొత్త లుక్‌తో ఇరగదీశాడు. ఈ లుక్‌కి టాలీవుడ్ జనాలు ఫిదా అయిపోయారు. ఈ కొత్త లుక్ టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా కూడా మారి చాలా మంది అదే స్టయిల్‌ను ఫాలో అయ్యారు. ఇప్పుడు బాబీ సినిమాలో కొత్త లుక్‌తో కనిపించడానికి ఇప్పటికే సన్నగా మారిన ఎన్టీఆర్ గడ్డం కూడా బాగా పెంచేశాడు. సినిమాలో ఎలా ఉండాలో డైరెక్టర్ చెబితే ఆ విధంగా తనను తాను మలుచుకునేందుకు వీలుగా ఇలా మారాడు తారక్. ఇక డైరెక్టర్ బాబీ.. ఎన్టీఆర్‌ను ఓ సరికొత్త లుక్‌లో ప్రెజెంట్ చేసేందుకు ఓ స్పెషలిస్ట్ స్టైలిస్టుని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడో తెలియాలంటే సినిమా లాంఛ్ వరకు ఆగాల్సిందే.

Leave a comment