టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో ఆకట్టుకున్న సందీప్

48

తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ మధ్యకాలంలో సరైన హిట్స్ లేక ఫ్లాప్ సినిమాలతో నెట్టుకొస్తున్నాడు. అయితే ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఇప్పుడు ఓ థ్రిల్లర్ మూవీతో మనముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ టీజర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఆడియెన్స్‌ ఈ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇక ఈ టీజర్‌ ఓపెనింగ్‌లో హీరోయిన్ ఆర్య సింగ్ ‘తను నా రిషి కాదు’ అనే డైలాగు చెప్పడంతో మొదలైన కన్ఫ్యూజన్ అలాగే టీజర్ మొత్తం కంటిన్యూ అయ్యింది. ఫ్లాష్‌బాక్‌లో సందీప్‌కు ఏం జరిగిందనే ప్రశ్న ఆడియెన్స్‌కు కలిగిస్తాడు మురళి శర్మ. మొత్తానికి సందీప్ కిషన్‌ను డైలమాలో పడేసిన ప్రశ్న ఏమిటీ..? అసలు తనకు ఏం అయ్యింది? అనే సందేహం కలిగే లోపే.. టీజర్ చివర్లో సందీప్ అద్దంలో తనను తాను చూసుకుంటే వెన్నెల కిషోర్ ఆత్మ కనిపిస్తుంది. ఈ అదిరిపోయే ట్విస్ట్‌తో సినిమా స్టోరీ లైన్ ఏమిటో చెప్పేశాడు దర్శకుడు.

మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ హార్రర్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను అంతే క్యూరియస్‌గా మనముందుకు తీసుకొచ్చేందుకు సందీప్ కిషన్ రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమా టీజర్‌కు మేజర్ అసెట్ థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పాలి. మరి టీజర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్లలో ఎంత మేర మెప్పిస్తుందో చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Leave a comment