దుమ్మురేపుతున్న ” ఎన్జీకే ” ట్రైలర్ !

24

తమిళ స్టార్ హీరో సూర్య, 7/జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలేవేరులే, యుగానికి ఒక్కడు సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీ రాఘవ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఎన్జీకే ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. సూర్యను పొలిటిషియన్ చూపిస్తూ తీసిన ఈ సినిమా ట్రైలర్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఫిదా హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ ముఖ్య భూమికను పోషిస్తున్నది. ఎన్‌జీకే.. (నంద గోపాల కృష్ణ)..సాయి పల్లవి, రకుల్ ప్రీత్ హీరోయిన్స్‌గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సమర్పణలో, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు.

ఒక బొమ్మ గీసేవాడు వాడి కొడుక్కి బొమ్మ గియ్యడం నేర్పిస్తే, మా నాన్న మిలట్రీరా, గోలీలాడుకోడం నేర్పిస్తాడా.. రక్తం చిందించి ధాన్యం పండించే ఒక్కో రైతుకి, ఈ దేశం బాగుండాలని కష్టపడే ఒక్కో కార్మికుడికి దేన్నైనా నిలదీసి అడిగే హక్కుంది.. అంటూ సూర్య చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి.

శివకుమార్ విజయన్ విజువల్స్, యువన్ శంకర్ రాజా ఆర్ ఆర్ బాగున్నాయి. త్వరలో ఎన్‌జీకే రిలీజ్ అవనుంది. ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్, ఆర్ట్ : విజయ్ మురగన్.

Leave a comment