అఖిల్ తో వివాదం పై నాని స్పందన..!

nani

టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కావడమో.. లేదా మరుసటి రోజు విడుదల కావడమో జరుగుతుంది. ఈ సంవత్సరం మొదలు చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ఆ తర్వాత బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి విడుదల అయ్యాయి. తాజాగా నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన ఎమ్‌సీఏ సినిమా ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా.. ఆ మరుసటి రోజే అక్కినేని వార‌బ్బాయి అఖిల్ న‌టించిన హ‌లో సినిమా విడుద‌ల కానుంది.

ఈ నేపథ్యంలో ఎమ్‌సీఏ సినిమా నిర్మాత దిల్‌రాజుకి, హ‌లో సినిమాను నిర్మించిన నాగార్జున‌కి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని గాసిప్స్ వ‌స్తున్నాయి. దీనిపై స్పందించిన హీరో నాని త‌న ఎమ్‌సీఏ ట్రైల‌ర్ బాగుంద‌ని అఖిల్ త‌న‌కు ఫోన్ చేసి చెప్పాడ‌ని తెలిపాడు. తాను కూడా హ‌లో సినిమా ట్రైల‌ర్ చూసిన వెంట‌నే అఖిల్‌కి కాల్ చేశాన‌ని అన్నాడు. కథా కథనం బాగుంటే.. ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని.. అలాంటి సినిమాలు బాగా ఆడుతాయని నాని అన్నారు.

పోటీగా ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులకు నచ్చితే వాటినన్నిటిని ఆదరిస్తారని అంటున్నాడు నాని. అఖిల్ తో తను చాటింగ్ చేసిన వాటిని షేర్ చేస్తే కాని ఈ విషయాన్ని నమ్ముతారా అంటూ చమత్కరించాడు. మొత్తానికి అఖిల్ తో నాకు పోటీ లేదు అని చెబుతున్న నాని తనకు అఖిల్ మధ్య గొడవలు లేవని చెప్పాడు.

Leave a comment