సమ్మోహనం రివ్యూల మీద నా నువ్వే నిర్మాత సంచలన కామెంట్స్..!

sammohanam-naa-nuvve-movies

కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన నా నువ్వే సినిమాను జయేంద్ర డైరక్షన్ చేశారు. తమన్నా ఫీమేల్ లీడ్ గా నటించిన ఈ సినిమా లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ఫలితంపై నిర్మాతల్లో ఒకరైన మహేష్ కోనేరు స్పందించారు. సినిమాకు తాము పడిన కష్టం వచ్చిన ఫలితం కాస్త బాధపెట్టాయని. అయినా సరే ఎంత బాధపడ్డా ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవించి ఈసారి వారిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తామని ట్వీట్ చేశారు మహేష్.

అయితే దీనికి రెస్పాన్స్ గా నా నువ్వే రివ్యూస్ వల్లే ఫ్లాప్ అయ్యింది అన్నట్టుగా ఓ అభిమాని చెప్పుకొచ్చాడు. దానికి స్పందించిన మహేష్ కోనేరు సినిమాల మీద రివ్యూల ప్రభావం కేవలం 10 నుండి 15 శాతం మాత్రమే ఉంటాయని. కరెక్ట్ గా తీస్తే సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అన్నారు. రీసెంట్ సమ్మోహనం సినిమా హిట్ అయ్యింది. కాబట్టి రివ్యూస్ గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు మహేష్.

నా నువ్వే నిర్మాత అయిన మహేష్.. సమ్మోహనం హిట్ అని చెప్పడం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటున్నారు. సినిమాల పరంగా పోటీ ఉన్నా హిట్ సినిమాకు ఎవరి సపోర్ట్ అయినా ఉంటుందని మహేష్ ప్రూవ్ చేశారు.

Leave a comment