Gossips" లక్ష్మీస్ ఎన్టీఆర్ " రివ్యూ & రేటింగ్

” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” రివ్యూ & రేటింగ్

సినిమా: లక్ష్మీస్ ఎన్టీఆర్
నటీనటులు: పి విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి, శ్రీతేజ్ తదితరులు
సంగీతం: కళ్యాణి మాలిక్
నిర్మాత: రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన సత్తా చూపించేందుకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ఎన్టీఆర్ బయోపిక్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా గురించి గతకొంత కాలంగా రచ్చరచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు జరిగిన వెన్నుపోటు.. లక్ష్మీ పార్వతి – ఎన్టీఆర్‌ల మధ్య రిలేషన్‌ను హైలైట్ చేస్తూ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నారా చంద్రబాబు నాయుడుని చూపించాడు వర్మ. ఆఖరి నిమిషంలో ఈ సినిమాను ఏపీ రాష్ట్రంలో ప్రదర్శించకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. ఏపీ మినహా మిగతా చోట్ల ఈ సినిమాను నేడు రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.
1
కథ:
ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ సినిమా స్టోరీ మొదలవుతుంది. ఎన్టీఆర్ ఆత్మకథ రాసేందుకు ఆయన ఇంటికి వస్తుంది లక్ష్మీ పార్వతి. ఆమెను తన ఇంట్లో ఉండేందుకు ఎన్టీఆర్ ఒప్పుకుంటాడు. కట్ చేస్తే.. ఎన్టీఆర్‌ను మళ్లీ సినిమాల్లో నటించేందుకు మోహన్ బాబు ఒప్పి్స్తాడు. అయితే లక్ష్మీ పార్వతి – ఎన్టీఆర్‌ల మధ్య ఏదో ఉందంటూ పుకార్లు రావడంతో ఎన్టీఆర్ బాధపడతాడు. కట్ చేస్తే.. లక్ష్మీ పార్వతిని తాను పెళ్లి చేసుకుంటానని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు చెబుతాడు. అయితే కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావడంతో.. మేజర్ చంద్రకాంత్ విజయోత్సవ సభలో తాను లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుంటున్నట్లు ఎన్టీఆర్ ప్రకటిస్తాడు.

కట్ చేస్తే.. లక్ష్మీ పార్వతిపై తప్పుడు ప్రచారం చేసే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు. 1994 ఎన్నికల కోసం అభ్యర్ధులను ప్రకటించిన ఎన్టీఆర్.. ఎన్నికల ప్రచారం లక్ష్మీ పార్వతితో కలిసి చేస్తాడు. కట్ చేస్తే.. ఎన్నికలు గెలిచిన ఎన్టీఆర్ ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. అటు పార్టీ పగ్గాలు అందుకునేందుకు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను భయపెట్టి.. వారి సహకారంతో ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తాడు. వైస్‌రాయ్ హోటల్ ఎపిసోడ్‌తో ఎన్టీఆర్ బాగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. కాగా కొంతమంది నేతల సహాయంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు. డిప్రెషన్‌లో కూడుకుపోయిన ఎన్టీఆర్ ఆసుపత్రిలో మరణిస్తాడు.
3
ఓవరాల్‌గా ఎన్టీఆర్‌కు జరిగిన వెన్నుపోటునే ప్రధానంగా చూపిస్తూ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. తెలిసిన కథ కాబట్టి.. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్‌ మూవీ రావడంతో ఈ సినిమాలో కొత్త అంశం ఏమీ కనిపించదు. దీంతో కొంతమేర అంచనాలను రీచ్ కావడంలో ఈ సినిమా ఫెయిల్ అయ్యిందని చెప్పాలి.

విశ్లేషణ:
ఎన్టీఆర్ జీవితంలో తెలిసిన విషయాన్నే మరోసారి ప్రేక్షకులపై రుద్దాడు వర్మ. అసలు కథ అంటూ తెగ డబ్బా కొట్టిన వర్మ.. లక్ష్మీ పార్వతి గురించి డబ్బా కొడుతూ.. చంద్రబాబును విలన్‌గా చూపించడంలోనే సినిమా సాగుతుంది. ఒక్క లక్ష్మీ పార్వతి ఎలా వచ్చింద.. ఆమెతో ఎన్టీఆర్ ఎలా మెదిలాడు అనే అంశం తప్ప.. మిగతా ఎపిసోడ్ మొత్తం రొటీన్ డబ్బానే కావడంతో ప్రేక్షకులను ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు.
2
ఫస్ట హాఫ్ మొత్తం లక్ష్మీ పార్వతి ఎంట్రీ.. ఎన్టీఆర్‌తో ఆమె పెంచుకునే పరిచయం.. అది కాస్త వారి మధ్య రిలేషన్‌కు దారి తీయడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎన్టీఆర్ చూడటం.. చివరకు ఆమెను పెళ్లి చేసుకోవడంతో కథను నడిపించాడు దర్శకుడు. వీరి మధ్య బంధాన్ని చూపించిన విధానం బాగానే ఉన్నా.. అది ఇంకాస్త బాగా చూపించవచ్చు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక చంద్రబాబును పూర్తిగా విలన్ పాత్రకే పరిమితం చేయడం కొంత మేర అభిమానులకు నచ్చదు.

సెకండాఫ్‌లో పార్టీ మీటింగ్‌లు.. ఎన్నికల ప్రచారంతోనే సాగుతుంది. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు వేసే ఎత్తుగడలతో ఆయన్ను పూర్తిగా నెగెటివ్ రోల్‌లో చూపించాడు. ఇక తనకు జరిగిన వెన్నుపోటుతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఎన్టీఆర్.. అదే డిప్రెషన్‌తో మరణిస్తాడు. అయితే ఆ తరువాత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు లక్ష్మీ పార్వతిని ఎలా ట్రీట్ చేశారనే అంశాన్ని మాత్రం మనకు ఇందులో చూపించలేదు. దీంతో సినిమాకు ముగింపు అసంపూర్ణంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే.. కేవలం లక్ష్మీ పార్వతి గురించి తప్ప ఈ సినిమాలో మరో అంశం చూపించేందుకు వర్మ ప్రయత్నించలేదని స్పష్టంగా తేలిపోయింది.

నటీనటుల పర్ఫార్మెన్స్:
ఎన్టీఆర్‌గా పి విజయ్ కుమార్ నటన అద్భుతంగా ఉంది. కొన్ని చోట్ల.. బాలకృష్ణ చేసిన ఎన్టీఆర్ బయోపిక్‌ కంటే కూడా ఇతడి యాక్టింగ్ బాగుంది అనిపిస్తుంది. ఇక లక్ష్మీ పార్వతిగా యజ్ఞా శెట్టి నటన సూపర్. ఎమోషన్స్ పండించడంలో ఆమె అద్భుతంగా నటించింది. అటు చంద్రబాబుగా నటించిన శ్రేతేజ్ కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు ఉన్నారంటే.. ఉన్నారు అంతే.
4
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
లక్ష్మీస్ ఎన్టీఆర్ – అసలు కథ అంటూ వర్మ మనకు కేవలం లక్ష్మీ పార్వతి డబ్బా మాత్రమే చూపించాడు. కొన్ని చోట్ల ల్యాగింగ్ ఎక్కువ కావడంతో ఆడియెన్స్‌కు చిరాకు లేస్తుంది. ఇక పెద్ద ట్విస్టులేమీ లేని సినిమా కావడంతో ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేకపోతారు. మరో దర్శకుడు అగస్త్య మంజుతో కలిసి వర్మ అసలేం చూపించాలనుకున్నాడో తెలీకుండానే సినిమా ముగుస్తుంది. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ బాగుంది. కొన్ని చోట్ల బ్యాక్‌గ్రౌండ్ సంగీతం బోరింగ్‌గా ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.

చివరగా:
లక్ష్మీస్ ఎన్టీఆర్ – లక్ష్మీ పార్వతి డబ్బా

రేటింగ్: 2.25/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news