కాజల్‌ ఇక మరో నయనతార

Kajal Aggarwal

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోయిన్స్‌ అంతా కూడా కుర్ర హీరోలతో రొమాన్స్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున వంటి సీనియర్‌ స్టార్‌ హీరోలతో నటించేందుకు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. స్టార్‌ హీరోలతో ఒకటి రెండు సినిమాలు చేయడం వల్ల కుర్ర హీరోలతో సినిమాలు చేసే అవకాశం రాదేమో అనే ఉద్దేశ్యంతో కొందరు హీరోయిన్స్‌ సీనియర్‌ స్టార్‌ హీరోల ఆఫర్లను వదులుకుంటున్నారు. కొందరు మాత్రమే కాస్త తెలివిగా ఆలోచించి సీనియర్‌ స్టార్‌ హీరోలతో నటిస్తున్నారు.

సీనియర్‌ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ నయనతార. ఈ అమ్మడు తెలుగులో దాదాపు అందరు సీనియర్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేసేసింది. తాజాగా చిరంజీవి సైరాలో కూడా ఈ అమ్మడు నటించేందుకు కమిట్‌ అయ్యింది. ఇక బాలయ్య జైసింహా చిత్రంలో కూడా నయనతార నటిస్తోంది. నయనతార తర్వాత కాజల్‌ సీనియర్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ అయ్యింది. కాస్త పారితోషికం ఎక్కువ తీసుకుని సీనియర్‌ హీరోలతో నటించేందుకు ఈ అమ్మడు ఆసక్తి చూపుతుంది.

ఖైదీ నెం.150లో చిరంజీవితో నటించి మెప్పించిన కాజల్‌ తాజాగా వెంకీకి జోడీగా నటించేందుకు సిద్ధమైంది. నయన్‌తో ఎక్కువ సార్లు నటించిన వెంకీ ఆమె స్థానంలో కాజల్‌కు ఓకే చెప్పాడు. కుర్ర హీరోల సరసన అవకాశం రాదని ఫిక్స్‌ అయిన కాజల్‌ సీనియర్‌ హీరోలతో నటించేందుకు కమిట్‌ అవుతూ ఉంది. త్వరలో కాజల్‌ హీరోయిన్‌గా నాగార్జునకు జోడీగా కూడా నటించే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

 

Leave a comment