డిస్ట్రిబ్యూటర్స్ కి చుక్కలు చూపిస్తున్నా బాలయ్య నిర్మాత..

balayya

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా జై సిం హా. నయనతార, హరిప్రియ, నటాషాలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. బాలయ్య రేంజ్ సినిమా అంటే భారీ బడ్జెట్టే ఉంటుంది. అయితే నిర్మాత దానికి ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. కాని సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడట కళ్యాణ్.

సినిమా అవుట్ పుట్ మీద పూర్తి నమ్మకం ఉండటంతో జై సింహా రేటుని ఓ రేంజ్ లో చెబుతున్నాడట నిర్మాత. ఏరియా వైజ్ బాలయ్య సినిమాలు తీసుకునే రేటు కన్నా ఇంకా పైగా మరో 40 శాతం ఎక్కువ చెబుతున్నాడట. ఈ విషయం పై డిస్ట్రిబ్యూటర్స్ కాస్త వెనక్కి తగ్గుతున్నారని తెలుస్తుంది. బాలయ్య సినిమా హిట్ అయితే ఆ లెక్క వేరే ఉంటుంది. అదే అంచనాలను అందుకోకపోతే మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ కు తిప్పలు తప్పవు.

అందుకే జై సింహా విషయంలో డేర్ చేయలేకపోతున్నారట. సంక్రాంతి రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ జై సింహా మరోసారి బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ ను సక్సెస్ చేసుకోవాలని చూస్తున్నాడు. మరి సినిమా ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.

Leave a comment