Gossipsజై లవ కుశ ప్రి రివ్యూ : ఎన్టీఆర్ నట విశ్వరూపం

జై లవ కుశ ప్రి రివ్యూ : ఎన్టీఆర్ నట విశ్వరూపం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు పాత్రలలో చేస్తూ వస్తున్న సినిమా జై లవ కుశ. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రాం నిర్మించారు. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమా సెన్సార్ నుండి వచ్చిన రిపోర్ట్ ప్రకారం సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఈనాటి ప్రీ రివ్యూలో చూద్దాం.

కథ :

ఒకే తల్లి కడుపున పుట్టిన జై లవ కుశలు చిన్నప్పుడు కలిసి మెలిసి ఉన్నా అందులో జై రావణ రాక్షసత్వంతో ఉండాడట. ఇక లవ కుశలు ఒకరికి ఒకరు ఎంతో ప్రేమ అనురాగాలతో ఉంటారు. జై తో సంబంధం లేకుండా లవ కుశలు ఎవరి లైఫ్ స్టైల్ లో వారు ఉండగా అనుకోకుండా ఓ సమస్య వచ్చి పడుతుంది. దానికి కారణాలు వెతికే క్రమంలో లవ కుశలు జై వల్లే ఇదంతా జరిగిందని తెలుసుకుంటారు. అక్కడ అదిరిపోయే ట్విస్ట్.. ఇంతకీ లవ కుశలను ఇబ్బందుల్లో పడేలా జై ఏం చేశాడు. ఇంతకీ లవ కుశలు ఆ సమస్య నుండి ఎలా బయటపడ్డారు అన్నది కథతోనే జై లవ కుశ వస్తుందట.

 

నటీనటుల ప్రతిభ :

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం జై లవ కుశ. తను చేసిన మూడు పాత్రల్లో ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం అని తెలుస్తుంది. లవ గా మంచి వాడిగా.. కుశ గా చిలిపి తనంతో కనిపించిన ఎన్.టి.ఆర్.. జై గా మాత్రం రోమాలు నిక్కబొడుకునే స్థాయిలో పర్ఫార్మెన్స్ చేశాడని తెలుస్తుంది. సినిమా మొత్తంలో జై పాత్ర హైలెట్ అవగా మిగిలిన రెండు పాత్రల్లో కూడా ఎన్.టి.ఆర్ నటనలో తన సత్తా చాటాడని అంటున్నారు. ఇక రాశి ఖన్నా హాట్ లుక్స్ తో ఆకట్టుకోగా.. జై ప్రేమికురాలిగా నివేథా థామస్ సెకండ్ హాఫ్ లో వచ్చి ఆకట్టుకుంటుందట. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారట.

 

సాంకేతికవర్గం పనితీరు :

బాబి కథ కథనాల మీద ఫుల్ గ్రిప్పింగ్ తో రాసుకున్నాడట. సినిమాతో కచ్చితంగా అతనికి మంచి పేరు వస్తుందని తెలుస్తుంది. ఇక సినిమాలో తన కెమెరా పనితనం చూపించిన చోటా కె నాయుడు సినిమాతో తన టాలెంట్ చూపించాడట. కొన్ని సీన్స్ లో చోటా సినిమాటోగ్రఫీ హైలెట్ అని అంటున్నారు. ఇక దేవి మ్యూజిక్ కూడా అదరగొట్టగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందట. ఇక నిర్మాణ విలువలు కూడా భారీగా ఉన్నాయని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ కు హిట్ ఇచ్చే క్రమంలో బడ్జెట్ విషయంలో కళ్యాణ్ రాం ఏమాత్రం వెనక్కి తగ్గలేదని తెలుస్తుంది.

విశ్లేషణ :

జనతా గ్యారేజ్ తర్వాత ఎలాంటి సినిమా తీయాలి అన్న కన్ ఫ్యూజన్ లో ఉన్న తారక్ కు బాబి చెప్పిన కథ నచ్చే జై లవ కుశ సినిమా తీశాడు. ఇక కథలో మూడు పాత్రలలో ఎన్.టి.ఆర్ నుండి నటనను తీసుకున్న విధానం అలరిస్తుందట. ఇక స్టోరీలోని ట్విస్టులు కూడా సినిమాకు మరో లెవల్ కు తీసుకెళ్తాయని తెలుస్తుంది. కచ్చితంగా బాబి ఈ సినిమాతో తన దర్శకత్వ ప్రతిభ చాటుకుంటాడని అంటున్నారు.

మొదటి భాగం మొత్తం లవ కుశలతో ఎంటర్టైనింగ్ మీద దృష్టి పెట్టగా సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఎమోషన్ అండ్ యాక్షన్ పార్ట్ తో అదరగొట్టారట. ఇక ఇంటర్వల్ టైంకు అభిమానుల అంచనాలకు అందని ఓ అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందట. అంతేకాదు అదే రేంజ్ లో సెకండ్ హాఫ్ స్టార్ అవడమే కాకుండా ఆ ఎమోషన్ క్లైమాక్స్ దాకా తీసుకెళ్తుందని అంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో చివరి 20 నిమిషాలు సినిమాకు ప్రాణం లాంటిదని.. సినిమాను ఆ ఎపిసోడ్ ఎక్కడికో తీసుకెళ్తుందని అంటున్నారు.

ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సిని ప్రేమికులందరికి ఈ సినిమా ఓ పండుగ భావన ఏర్పడేలా చేస్తుందని తెలుస్తుంది. మరి ప్రీ రివ్యూ ఈ రేంజ్ లో ఉంది అంటే సినిమా సంచలనాలకు సిద్ధం అన్నట్టే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news