ఎన్టీఆర్ కి హారిక క్రియేషన్స్ కార్ల గిఫ్టుల అసలు లెక్క ఇదే..!

ntr-trivikram-car-gift

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైంలో ఎన్.టి.ఆర్, త్రివిక్రం లకు నిర్మాత ఎస్. రాధాకృష్ణ రెండు కార్లు కొనిచ్చాడని టాక్. ఎవరైనా సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టాక గిఫ్టులిస్తారు కాని రాధాకృష్ణ ముందే ఈ పని చేశారేంటని అందరు అనుకున్నారు.

కాని ఇక్కడ అసలు విషయం ఏంటంటే హారిక క్రియేషన్స్ అధినేత రేంజ్ రోవర్ కారు కొన్నారు. అది ఎందుకో నచ్చక ఆ కారుని త్రివిక్రం కు ఇచ్చేశారట. ఇక ఆ తర్వాత మళ్లీ ఓ లక్సరీ కారుని కొన్నాడట రాధాకృష్ణ. రాధాకృష్ణ కారుని చూసి ఆయన అన్న కొడుకు సితార ఎంటర్టైన్మెంట్ వంశీ మరోటి తీసుకున్నారట.

ఎలాగు రెండు కార్లు ఉన్నాయి కదా అని ఎన్.టి.ఆర్ కు ఇష్టమైన 9999 నెంబర్ సాధించారు. ఆ కారుని ఎన్.టి.ఆర్ ను పికప్ చేసుకునేందుకు పంపిస్తున్నారట. ఒకేరకమైన కారులో ఎన్.టి.ఆర్, త్రివిక్రం లు కనిపించేసరికి వారిద్దరికి రాధాకృష్ణ కార్లు గిఫ్ట్ గా ఇచ్చారని చాటింపేస్తున్నారు.

Leave a comment