చేసిన సహాయానికి శభాష్ అనిపించుకున్న నందమూరి బ్రదర్స్..!

147

తిత్లీ తుఫాన్ కారణంగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో వందల గ్రామాలు అతలాకుతలమయ్యాయి. భారీ ఆస్తి నష్టం సంభవించడంతో ఉత్తరాంధ్ర ప్రజలు డీలా పడిపోతున్నారు. తుఫాను బీభత్సానికి ఏకంగా 169 గ్రామాలు అతలాకుతలమయ్యాయి.
ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టగా సిని సెలబ్రిటీస్ కూడా మేమున్నామంటూ సపోర్ట్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.

తాజాగా ‘అరవింద సమేత’ సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ తిత్లీ తుఫాను బాధితుల అండగా ఉండేందుకు రూ. 15 లక్షలను సిఎం రిలీఫ్ ఫండ్ కు అందించారట. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కూడా రూ. 5 లక్షలను సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు.

గతంలో కూడా ఈ అన్నదమ్ములు కేరళ వరద బాధితులకు 35 లక్షలు విరాళం అందించగా ఇప్పుడు కూడా స్పందించి మరోసారి తమ మంచి మనసు చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ లను మంత్రి నారా లోకేష్ అభినందించారు.

Leave a comment