మెగా ఫంక్షన్ కి స్పెషల్ గెస్ట్ గా బాలయ్య..!

balayya and sai dharma tej

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా వి.వి.వినాయక్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఇంటిలిజెంట్. ఈ సినిమా టీజర్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారు. ఈ టీజర్ బాలయ్య చేతుల మీదుగా రిలీజ్ చేస్తుండటం విశేషం. మెగా హీరో అయ్యుండి బాలయ్య చేతుల మీద ప్రమోషన్ అంటే కొత్తగా ఉందని చెప్పొచ్చు.

బాలకృష్ణ కూడా సినిమాకు సంబందించి ఎవరేం అడిగినా కాదనలేడు. అదిగాక వినాయక్ డైరక్షన్ లో ఆయన సినిమాలు కూడా చేశాడు. కాబట్టి తేజ్ ఇంటిలిజెంట్ టీజర్ ను నట సింహం నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నారు. బాలయ్య రిలీజ్ చేస్తున్నాడంటే సినిమా కచ్చితంగా మంచి హిట్ అన్నట్టే. రీసెంట్ గా గరుడవేగ సినిమాకు బాలయ్య తన సపోర్ట్ ఇచ్చారు.

ఆ సినిమా కూడా చాన్నాళ్ల తర్వాత రాజశేఖర్ కు ఓ సూపర్ హిట్ ఇచ్చింది. మరి మెగా హీరో ఆశిస్తున్న సూపర్ హిట్ ఇంటిలిజెంట్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

చుక్కలు చూపించిన “భాగమతి” పబ్లిక్ టాక్

Leave a comment