చికాగో సెక్స్ రాకెట్.. లీకైన ఆడియో టేపులు.. సోషల్ మీడియాలో వైరల్..!

chicago-sx-racket

ఈవెంట్స్ పేరుతో అమెరికా వెళ్లడం అక్కడ ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదించడం. ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న చికాగో సెక్స్ రాకెట్ పై రోజుకో సంచలన వార్త బయటకు వస్తుంది. ఈ సెక్స్ రాకెట్ లో కొత్తగా ఓ ఆడియో టేప్ బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ తతంగం నడుపుతున్న కిషన్, చంద్రలను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తుండగా ఏ క్షణాన వారి పేర్లు బయటకు వస్తాయో అని వారి ఉచ్చులో పడ్డ హీరోయిన్స్ కంగారు పడుతున్నారు.

కిషన్ దంపతులతో పాటుగా ఐదుగురు హీరోయిన్స్ ను విక్టిమ్స్ గా పేర్కొన్నారు. వారి పేర్లు బయటకు చెప్పకున్నా ఈ ఆడియో టేపులతో వాయిస్ గుర్తుపడితే తమ కెరియర్ కు గండి పడినట్టే అని సదరు భామలు కంగారు పడుతున్నారు. పోలీసులకు ఈ ఆడియో టేపులను ఎవరిచ్చారు అన్న కోణంలో కూడా డౌట్లు రేజ్ అవుతున్నాయి.

గుట్టుగా సాగిస్తున్న ఈ వ్యవహారంతో కిషన్ అక్కడ బాగానే సంపాదించాడట. అందుకే గిట్టని వాళ్లు ఈ ఆడియో టేపులను ఇచ్చి ఉంటారని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సంచలనంగా మారిన చికాగో సెక్స్ రాకెట్ లో ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందో అని టాలీవుడ్ జనాలు షేక్ అవుతున్నారు.

Leave a comment