Moviesశ్రీదేవి బయోపిక్ ని బోనీకపూర్ అడ్డుకోవడానికి కారణం అదేనా ..? ఫాన్స్...

శ్రీదేవి బయోపిక్ ని బోనీకపూర్ అడ్డుకోవడానికి కారణం అదేనా ..? ఫాన్స్ కి కొత్త డౌట్లు..!

శ్రీదేవి .. సినిమా ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ .. ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే . ఒకటి కాదు రెండు కాదు కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది . ఎన్నో అరుదైన అవార్డ్స్ కూడా అందుకుంది . సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అయ్యేటివో మనం చూసాం .

అయితే సడన్గా ఆమె దుబాయ్ లోని హోటల్లో బాత్ టబ్ లో పడి మరణించింది అన్న విషయం తెలుసుకొని జనాలు షాక్ అయిపోయారు. శ్రీదేవి మరణం పై ఇప్పటికీ వీడని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి . అయితే శ్రీదేవి బయోపిక్ రావాలి అంటూ ఫ్యాన్స్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు . పలువురు బడా డైరెక్టర్స్ కూడా ఆమె బయోపిక్ ని తెరకెక్కించడానికి రెడీగా ఉన్నారు . అయితే బోనీకపూర్ మాత్రం ఆమె బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు రీసెంట్గా మీడియాతో మాట్లాడిన బోనీకపూర్ ఇప్పటికి అదే మాట చెప్పుకొస్తున్నారు.

తాను బ్రతికున్నంత వరకు శ్రీదేవి బయోపిక్ తెరకెక్కించే సమస్య లేదు అని కరాకండిగా చెప్పేయడం ఫ్యాన్స్ కి ఒక అంతా ఆశ్చర్యంగా అనిపించింది . చాలామంది శ్రీదేవి మరణించినప్పుడు బోనికపూర్ హస్తం ఉంది అంటూ ప్రచారం చేశారు . బహుశా అది నిజమేనేమో అందుకే ఆ విషయాలు ఎక్కడ బయటపడతాయి అన్న భయంతోనే శ్రీదేవి బయోపిక్ను బోనీకపూర్ ఓకే చేయడం లేదు ఏమో అంటూ కొత్త డౌట్లు వ్యక్తం చేస్తున్నారు ఫాన్స్ ..ఏమో అసలు నిజానిజాలు దేవుడికే తెలియాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news