Moviesఈ సుద్దపూస కుర్రాడి ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? తెలుగు...

ఈ సుద్దపూస కుర్రాడి ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? తెలుగు టైర్ 2 హీరోలు కూడా వేస్ట్..!!

ఈ మధ్యకాలంలో స్ట్రీమింగ్ అయిన 90స్ వెబ్ సిరీస్ ఎంత విజయం అందుకుందో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా శివాజీ నటన ఈ సిరీస్ కి హైలైట్ గా మారింది . అంతేకాదు ఈ సిరీస్లో తర్వాత హైలైట్ అయింది ..ఎవరు అంటే మాత్రం అందరూ చెప్పేది సుద్దపూస కుర్రాడు . అసలు ఈ వీడియో ఎంతమంది యూట్యూబ్ – వాట్సాప్ ద్వారా షేర్ చేసే తమ బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఈ వెబ్ సిరీస్ లో.. శివాజీ భార్యగా తొలిప్రేమ ఫేమ్ వాసుకి నటించిన విషయం అందరికీ తెలిసిందే. అదే విధంగా స్టాండ్ అప్ కమెడియన్ మౌళి , బాల నటుడు రోహన్ రాయ్ శివాజీ కొడుకులుగా నటిస్తారు . శివాజీ చిన్న కొడుకుగా నటించిన రోహన్ రాయి సిరీస్ కి హైలైట్ గా మారాడు. మరి ముఖ్యంగా మార్కులు చూపించేటప్పుడు నాన్న దగ్గర అతివినియం చూపిస్తూ అడ్డంగా బుక్ అయిపోతాడు . సుప్పిని సుద్దపూసని అంటూ రోహన్ నవ్వులు పండించాడు .

ఇప్పటికి ఆ వీడియో మనం చూస్తే నవ్వు ఆపుకోలేము. అలాంటి ఓపెర్ఫార్మన్స్ ఇచ్చారు . ఆ తర్వాత చాలా చాలా ఆఫర్స్ వచ్చాయట. ఒక్క వెబ్ సిరీస్తో ఆయన దశ తిరిగిపోయింది అంటూ టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి . రీసెంట్గా రోహన్ రాయి గురించి సోషల్ మీడియాలో న్యూస్ తెగ తెగ వైరల్ గా మారింది. తాను ఇండియా సినిమాల్లో కూడా రోహన్ కి అవకాశాలు వస్తున్నాయట. అంతేకాదు అతగాడు అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ రెడీగా ఉన్నారట.

అతనిని బెంగుళూరు నుంచి తీసుకోవడానికి స్పెషల్ ఫ్లైట్ లు కూడా బుక్ చేస్తున్నారట . నిజంగా ఇది స్టార్ హీరో రేంజ్ అనే చెప్పాలి. కేవలం ఒక్క సిరీస్ తోనే ఈ రేంజ్ లో ఆకట్టుకున్నాడు అంటే నిజంగానే ఈ పిల్లాడికి మంచి భవిష్యత్తు ఉంది అంటున్నారు జనాలు. అంతేకాదు రోహన్ రోజుకి 30,000 డిమాండ్ చేస్తున్నాడట. అయినా కూడా నిర్మాతలు ఓకే చేస్తున్నారట . చూద్దాం రోహన్ ఎలాంటి సినిమాలో నటించి మెప్పిస్తాడో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news