Moviesఎప్పుడు రాజకీయాల్లో ఫింగర్ పెట్టని ఉపాసన..విజయ్ పొలిటికల్ ఎంట్రీ‌పై మాట్లాడడం వెనుక...

ఎప్పుడు రాజకీయాల్లో ఫింగర్ పెట్టని ఉపాసన..విజయ్ పొలిటికల్ ఎంట్రీ‌పై మాట్లాడడం వెనుక ఆయన హస్తం ఉందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఎప్పుడు రాజకీయాల గురించి పెద్దగా కామెంట్స్ చేయని ఉపాసన ఫస్ట్ టైం రాజకీయాలపై తనదైన స్టైల్ లో రెస్పాండ్ అయింది . దీంతో ఉపాసన పేరు నెట్టింత హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా ఉపాసన ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది . ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ – ప్రైవేట్ – ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా ఓపెన్ గా స్పందించింది .

రామ్ చరణ్ గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది. ఇదే క్రమంలో ఉపాసనను హోస్ట్ ప్రశ్నిస్తూ ..”విజయ్ తలపతి పొలిటికల్ పార్టీ పై క్వశ్చన్స్ అడిగింది..?” నిజానికి ఉపాసన ఎప్పుడు కూడా పొలిటికల్ జోనర్ ను టచ్ చేయరు . కానీ ఈసారి మాత్రం చాలా హుందాగా ఆన్సర్ ఇచ్చింది. ” ఆయన సినిమాలు చాలా చాలా బాగుంటాయి ..ప్రతిదీ మెసేజ్ ఓరియంటెడ్ ..ప్రజలకు సేవ చేయాలి అనే విధంగానే ఉంటాయి ..ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన అలాంటి వారే ..ఈ విషయంలో నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెబుతున్నాను ..మీకు మార్పు కావాలి అనుకున్నప్పుడు లీడర్ ఎవరు అనేది చూడకుండా సపోర్ట్ చేయండి ..చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు సీఎం అయ్యారు.. రాష్ట్రాన్ని బాగా పాలించారు ..కొత్త నాయకుడిని సపోర్ట్ చేసినప్పుడే మార్పు అనేది వస్తుంది. “

“ఆ మార్పు తమిళనాడులో కూడా వస్తుంది అంటూ నేను నమ్ముతున్నాను “అంటూ విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన కామెంట్స్ చేసింది. ప్రజెంట్ ఉపాసన మాటలు వైరల్ అవుతున్నాయి . అయితే ఇదే ఇంటర్వ్యూలో “మీరు రాజకీయాల్లోకి వస్తారా..?” అంటూ హోస్ట్ ప్రశ్నించగా..” రాజకీయాలకు రావడం అనేది మాత్రం జరగదు కానీ మార్పు తీసుకోరావడం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను ..మంచి నాయకుడికి కచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది . ప్రజెంట్ ఉపాసన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఉపాసన ఎందుకు విజయ్ ని సపోర్ట్ చేసింది అనే విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. కొందరు ఆమె వెనుక ఎవరో ఉండి మాట్లాడిచ్చారు అంటూ చెప్పుకొస్తున్నారు. నిజానికి ఉపాసన విజయ్ ని కాదు ప్రతి పొలిటికల్ లీడర్ ను సపోర్ట్ చేస్తుంది . ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో అంటూ మెగా అభిమానులు ఉపాసనని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news