Moviesఆ ఒక్క సీన్ ధియేటర్ లో పడి ఉంటేనా.. హనుమాన్ సినిమా...

ఆ ఒక్క సీన్ ధియేటర్ లో పడి ఉంటేనా.. హనుమాన్ సినిమా 1000కోట్లు దాటేస్తుంది..నో దౌట్..!

హనుమాన్ .. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా తేజ సజ్జా నటించిన సినిమా . సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి ఎలాంటి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుందో మనకు తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 250 కోట్లు క్రాస్ చేసి సంచలన రికార్డును నెలకొల్పింది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చాలా చిన్న నటీనటులతో తెరకెక్కించిన ఈ సినిమా ఈ విధంగా హిట్ అవ్వడం సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులకు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది .

ప్రశాంత్ వర్మ పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతుంది . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హిమాలయల్లో నుంచి హనుమాన్ హీరో దగ్గరికి వచ్చే సమయంలో కొన్ని సీన్స్ చూపిస్తారు . ఈ క్రమంలోనే వారణాసిలో ఒక ముని ధ్యానం చేస్తూ ఉండగా హనుమాన్ ఆకాశంలో వాయువేగంతో వెళ్లడం ఆ ముని కళ్ళు తెరిచి పైకి చూపిస్తాడు . అయితే నిజానికి ఈ సీన్ కి బదులు ప్రశాంత్ వర్మ మరో విధంగా సీన్ ను తెరకెక్కించాలనుకున్నాడట .

ఆ సీన్ ని అయోధ్య రామ మందిరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాలి అని రాసుకున్నాడట . అయితే అయోధ్య రామ మందిరం ఎదురుగా ఉన్న దీపాలను ఒక పాప వెలిగించడానికి ట్రై చేస్తున్న మూమెంట్లో అది గాలికి ఆరిపోతూ ఉండగా .. హనుమాన్ పైన వెళ్లడంతో ఒక్కసారిగా ఆ దీపాలు వాటికి అవే వెలుగుతాయట . కానీ ఆ సీన్ ని ప్రశాంత్ వర్మ తెరకెక్కించడం కుదరలేదట . రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు . ఒకవేళ నిజంగా ఆయన అనుకున్న విధంగా ఆ సీన్ ని తెరకెక్కించుంటే మాత్రం థియేటర్స్ లో అభిమానులకి గూస్ బంప్స్ మోతే. కచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్లు దాటుండేసేది అంటున్నారు అభిమానులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news