Moviesమోక్షజ్ఞ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న బాలయ్య.. ఫ్యాన్స్ కలలో కూడా...

మోక్షజ్ఞ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న బాలయ్య.. ఫ్యాన్స్ కలలో కూడా ఊహించనిది..!

సినిమా ఇండస్ట్రీలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కోట్లాదిమంది నందమూరి ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మనకు తెలిసిందే . మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని బాలయ్య కొన్ని సందర్భాలలో పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశాడు . కానీ ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు . అయితే సోషల్ మీడియాలో గత కొన్ని సంవత్సరాలుగా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి . కొందరు అఖండ 2 ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటే మరికొందరు ఆదిత్య 369 సీక్వెల్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు .

బాలకృష్ణ కొడుకు ఎంట్రీ ఇస్తే చాలు అది ఏ సినిమా అయినా పర్లేదు హిట్ చేసే బాధ్యత మాది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . అయితే రీసెంట్గా నందమూరి కాంపౌండ్ నుంచి ఓ విషయం సోషల్ మీడియాలో లీకై బాగా ట్రెండ్ అవుతుంది . ప్రెసెంట్ రాజకీయాలలో బిజీబిజీగా ముందుకు వెళ్తున్నాడు బాలయ్య. త్వరలోనే జరగబోయే ఎలక్షన్స్ లో భారీ విజయంతో గెలవడం పక్క అంటున్నారు. ఇలాంటి మూమెంట్లోని బాలయ్య రాజకీయాల్లోకి గెలిచాక సినిమా ఇండస్ట్రీ పై పెద్దగా ఫోకస్ చేయలేకపోవచ్చు .

ఈ క్రమంలోనే కొడుకుకి అప్పుడే సినీ బాధ్యతులను అప్పజెప్పేస్తున్నాడట బాలయ్య . సినిమా ఇండస్ట్రీలోకి మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది . ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొందరు పెద్ద వ్యక్తులతో పరిచయం చేశారట . అంతేకాదు బాలయ్య త్వరలోనే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ డీటెయిల్స్ ను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారట . అప్పుడు రాజకీయాలలో బాలయ్య బిజీ అయిన సినీ పరంగా కొడుకు ఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ కూసింత హ్యాపీగా ఉంటారు అంటూ ఈ నిర్ణయం తీసుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news