Moviesగుంటూరు కారం సినిమాకు ఆ ఒక్కటే మైనస్.. లేకపోతే సినిమా ఇంకా...

గుంటూరు కారం సినిమాకు ఆ ఒక్కటే మైనస్.. లేకపోతే సినిమా ఇంకా చించిపడేసేదా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ చేస్తున్నారు పలువురు మహేష్ బాబు ఫ్యాన్స్ . రీసెంట్గా టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబు నటించిన సినిమా గుంటూరు కారం . ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా ఏ ముహూర్తంన స్టార్ట్ చేశారో తెలియదు కానీ అప్పటినుంచి ఎన్నెన్నో బ్యాడ్ కామెంట్స్ అవాంతరాలు అవరోధాలు ఎదుర్కొంది . కానీ ఫైనల్లీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

మరి ముఖ్యంగా మహేష్ బాబు నటన ఈ సినిమాకి హైలైట్ గా మారింది. ఈ సినిమాలో మహేష్ బాబు ఊర నాటు మాస్ రేంజ్ లో కనిపిస్తాడు . మరీ ముఖ్యంగా కూర్చి మడత పెట్టి సాంగ్లో మహేష్ బాబు అభిమానులకు పూనకాలు తెప్పిస్తాడు. అలాంటి ఓ క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్ బాబు. అయితే సినిమాలో అన్ని బాగున్నప్పటికీ సినిమా కథ మొత్తం పాత రొటీన్ స్టోరీ లానే ఉంది అన్న నెగటివ్ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి .

మహేష్ బాబు నటన ఓకే ..త్రివిక్రమ్ డైరెక్షన్ ఓకే.. శ్రీ లీల – మీనాక్షి నటనలు కూడా ఓకే ..కానీ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ కొత్త కంటెంట్ ఏమీ లేదని.. పాత చింతకాయ పచ్చడి లానే ఉంది అన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు మహేష్ బాబు అభిమానులు . దీంతో సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్. చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news