Moviesఊహించని చిక్కుల్లో సింగర్ చిత్ర.. ఇలా ఇరుక్కుపోయింది ఏంటి..?

ఊహించని చిక్కుల్లో సింగర్ చిత్ర.. ఇలా ఇరుక్కుపోయింది ఏంటి..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది . స్టార్ సింగర్ చిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె పాటలు పాడితే ఎంత అద్భుతంగా ఉంటాయో మనసుకి ఎంత హాయిగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ గాయని మణూలల్లో ఆమె కూడా ఒకరు .

వేలాదిగా పాటలు పాడిన ఎంతోమంది అరుదైన సింగర్స్ లలో ఆమె కూడా ఒకరు అన్న విషయం మనం మర్చిపోకూడదు . ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిత్ర ఇన్నేళ్ల తన కెరియర్లో ఎప్పుడు వివాదాలను ఎదుర్కోలేదు. అసలు కాంట్రవర్షియల్ కంటెంట్ జోలికి ఆమె వెళ్లలేదు. ఎవరి ఊసు కూడా ఆమె ఎత్తదు . కానీ ఫస్ట్ టైం సింగర్ చిత్ర సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ కి గురవుతుంది. అది కూడా ఆమె తప్పు లేకుండానే..ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు .

ఈ క్రమంలోనే చిత్రకూడా ప్రజలందరూ శ్రీరామ నామాన్ని స్మరించాలి అని …సాయంత్రం వేళ ఇంటి ప్రాంగణంలో ఐదు దీపాలను వెలిగించాలి అని కోరుతూ చిత్ర రీసెంట్గా వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో తప్పు ఏమీ లేదు. కానీ కొంతమంది మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో ఓ రాజకీయ పక్షానికి మద్దతుగా తెలిపే విధంగా ఉంది అని.. ఒక స్టార్ సింగర్ ఇలా ఎలా రాజకీయాల పక్షంగా మాట్లాడుతుంది అని ఆమెను ట్రోల్ చేస్తున్నారు . అయితే పలువురు చిత్ర సపోర్ట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news