Moviesదేవర పై గూస్ బంప్స్ న్యూస్ చెప్పిన కిచ్చా సుదీప్.. పండగ...

దేవర పై గూస్ బంప్స్ న్యూస్ చెప్పిన కిచ్చా సుదీప్.. పండగ మళ్లీ మొదలైందిరోయ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ..తాజాగా నటిస్తున్న సినిమా దేవర . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకో న్నాయి. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు ఇతర భాషలలో కూడా దేవర గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకోవడం గమనార్హం.

ఈ క్రమంలోనే కన్నడ వర్షన్ గ్లింప్స్ కి సంబంధించిన విషయంపై కిచ్చా సుదీప్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ను ఓ రేంజ్ లో పొగిడేసారు. రీసెంట్గా ఆయనకు ఒక ప్రెస్ మీట్ లో దేవర గురించి ప్రశ్న ఎదురైంది . ఒకే ఒక్క వర్డ్ తో అదరగొట్టేసాడు కిచ్చా సుదీప్ . “దేవర గ్లింప్స్ చూసానని ఎపిటోమ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకొచ్చారు”. తారక్ గురించి పాజిటివ్ గా రియాక్ట్ కావడంతో ఫాన్స్ ఫిదా అవుతున్నారు .

కన్నాడ లో కూడా ఎన్టీఆర్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దేవర సినిమా కన్నడ ఇండస్ట్రీలో కూడా సంచలనాన్ని క్రియేట్ చేయబోతుంది అంటున్నారు జనాలు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ నుంచి ఇంత వరకూ సినిమా రాకపోవడంతో ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉన్నారు. అంతే కాదు దేవర సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదరు చూస్తూ ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news