Moviesరిలీజ్ కి ముందే రికార్డులు బ్రేక్ చేసిన "గుంటూరు కారం".. మహేష్...

రిలీజ్ కి ముందే రికార్డులు బ్రేక్ చేసిన “గుంటూరు కారం”.. మహేష్ బాబు టోటల్ ఇండస్ట్రీని మడత పెట్టేసాడుగా ..!!

“గుంటూరు కారం”.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం. మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో హాట్ బ్యూటీ శ్రీ లీల – మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు .

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకునింది . కాగా రిలీజ్ కి ముందే గుంటూరు కారం సినిమా సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది . ఇప్పటివరకు సినీ చరిత్రలో కనివిని ఎరుగని రికార్డును క్రియేట్ చేసి మహేష్ బాబు గుంటూరు కారం స్పెషల్ స్థానాన్ని దక్కించుకుంది . హైదరాబాదులో ఎక్కువ స్క్రీన్స్ ఉన్న థియేటర్ ఏది అంటే ప్రసాద్ ఐమాక్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా రిలీజ్ అయింది అంటే చాలు అందరూ అక్కడే కనపడతారు .

కాగా ప్రసాద్ ఐమాక్స్లో ఇటీవల సలార్ సినిమా రిలీజ్ అయి 37 షోలు పడి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ గుంటూరు కారం ఏకంగా 41 షోలు వేయనున్నారట .ఈ విషయాన్ని ప్రసాద్ మల్టీప్లెక్స్ అధికారికంగా ప్రకటించింది . గుంటూరు కారం సినిమాకి అర్ధరాత్రి నుంచే ఎక్స్ట్రా షోలకు పర్మిషన్ రావడంతో ఆరోజు ఆల్మోస్ట్ అన్ని షోలు కూడా గుంటూరు కారం సినిమాకి కేటాయించారట . దీంతో సినీ ఇండస్ట్రీలో ఇది ఓ సెన్సేషనల్ రికార్డు గా నిలిచింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news